రాజకీయాల్లో ప్రజలకు మేలు చేస్తున్నట్లు పైకి కనిపించి..దాని వెనుక రాజకీయ కుట్రలు చేసి ప్రత్యర్ధులని దెబ్బతీసే కార్యక్రమాలు చేయడంలో వైసీపీ ఎప్పుడు ముందే ఉంటుందని చెప్పవచ్చు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ దిశగానే పనిచేస్తుంది. పైకి ప్రజలకు ఏదో మేలు చేసేసినట్లు పనులు చేస్తున్నట్లు కనిపిస్తున్న దాని వెనుక రాజకీయ కోణం వేరేగా ఉంటుంది.

ఆ దిశలోనే మూడు రాజధానుల నిర్ణయం తీసుకుని..అమరావతిని దెబ్బకొట్టి..మిగతా ప్రాంతాల్లో లబ్దిపొందాలనే విధంగా వైసీపీ స్కెచ్ వేసింది. ఇక ఇప్పుడు అమరావతిలో సైతం పాగా వేయడానికి వైసీపీ కొత్త వ్యూహాలతో ముందుకొచ్చింది. అక్కడ ఉండే తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల్లో లబ్ది పొందడానికి ఇళ్ల పట్టాల పేరుతో కొత్త రాజకీయ క్రీడకు తెరలేపింది. దీని ద్వారా అమరావతిలో రైతులకు చెక్ పెట్టినట్లు ఉంటుంది..అటు టిడిపికి చెక్ పెట్టినట్లు ఉంటుందనేది వైసీపీ కాన్సెప్ట్. అంటే బయట ప్రాంతాలకు చెందిన వైసీపీ శ్రేణులకు అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇస్తూ..వారిని ఓట్లుగా మార్చి అమరావతిలో లబ్దిపొందాలనేది జగన్ వ్యూహం.

అంటే మంగళగిరిలో నారా లోకేశ్‌ని మళ్ళీ ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది..పేదలకు ఇళ్ల పట్టాల పేరుతో అమరావతిలో వైసీపీ వాళ్ళకు స్థలాలు ఇచ్చి..వారిని ఓటర్లుగా మార్చి..అక్కడ లోకేశ్‌ని ఓడించాలని జగన్ స్కెచ్ వేశారు. కానీ రాజధాని ప్రాంతంలో ఉండే ప్రజలు వైసీపీకి పూర్తిగా యాంటీగా ఉన్నారు. ఎన్ని ఎత్తులు వేసిన అమరావతిలో వైసీపీ వ్యూహాలు పనిచేసేలా లేవు. ఈ సారి మాత్రం అమరావతిలో వైసీపీకి భారీ దెబ్బ తగలడం ఖాయమని చెప్పవచ్చు.