ఏపీ సీఎం జగన్ ఏర్పాటు చేసుకున్న కొత్త మంత్రి వర్గంలోని కొందరిపై మరకలు.. మచ్చలు పడుతున్నా యి. వీరిలో ఎక్కువ మంది గత కేబినెట్‌లో ఉన్నవారే కావడం గమనార్హం. వీరిలో ప్రధానంగా గుమ్మనూరు జయరాం, ఆదిమూలపు సురేష్‌లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా కొందరు కొత్త మం త్రులను తీసుకున్న విధానంపైనా విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలపై విరుచుకుపడిన వారికి.. ప్రతి పక్ష నేత చంద్రబాబు ఇంటిపై దాడికి ప్రయత్నించిన వారికి ప్రాధాన్యం దక్కిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ పరిణామం.. జగన్ సర్కారుకు ఇబ్బందిగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తుండడం గమనార్హం.
గుమ్మనూరు జయరాం విషయం తీసుకుంటే.. ఆయన కుమారుడు బెంజ్ కారును ఓ కంపెనీ నుంచి బహు మానంగా తీసుకున్నాడనే ఆరోపణలు వున్నాయి. అదేవిధంగా ఆయన కుటుంబానికిచెందిన భూముల కబ్జా ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఇదికోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో ఈయనకు మంత్రి పదవి ఇవ్వడం పై సొంత పార్టీ నేతలే.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఆది మూలపు సురేష్ కూడా మం త్రిగా అనేక అవకతవకలు పాల్పడ్డారంటూ… ప్రతిపక్షాలు లెక్కలతో సహా వివరిస్తున్నాయి. ఇదే విషయాన్ని వైసీపీలోని కొందరు నాయకులు సైతం బయట పెట్టారు. దీంతో ఈయనను తిరిగి తీసుకోవడంపైనా.. ఆం దోళన వ్యక్తం చేస్తున్నారు.
మంత్రిగా ఆదిమూలపు సురేశ్ రూ.1846 కోట్ల అవినీతికి పాల్పడ్డారని వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నా రు. ఇక, పాత మంత్రులను పక్కన పెడితే.. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్నవారిని తీసుకుంటే.. గుడి వాడ అమర్నాథ్.. ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ప్రతిపక్షంపై విరుచుకుపడుతున్నారు. ఇక, జోగి రమే ష్.. ఏకంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, కారుమూరు నాగేశ్వరరావు కూడా ఇటీవల కాలంలో టీడీఆర్ బాండ్ల కుంభకోణంలో పాత్ర ఉందనే వాదన బలంగా విననిపించింది.
ఇక, సొంత పార్టీలోనే కుంపట్లు పెడుతున్నారనే ఒక మహిళా నేతకు బీసీ కోటాలో మంత్రి పదవి ఇవ్వడా న్ని.. వైసీపీ నాయకులే జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక, నియోజకవర్గంలోనే ఉండరని.. సొంత వ్యవహా రాలు.. చేసుకునేందుకు బెంగళూరుకే పరిమితమవుతున్నారనే వాదనలు ఉన్న.. ఎంపీతోనూ.. వివాదా లకు కేంద్రంగా ఉన్న .. మరో మహిళా నేతకు.. మంత్రి పదవి ఇవ్వడంపైనా వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చాలా మంది వ్యవహారం.. వివాదానికి దారితీస్తోందని అంటున్నారు పరిశీలకులు. మరి వీరితో జగన్ ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.
Discussion about this post