బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి..ఒకే దెబ్బకు హైలైట్ అయిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్…ఈ మధ్య రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉండటం లేదనే సంగతి తెలిసిందే. ఎప్పటినుంచి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో రాజకీయం చేస్తూ వస్తున్న జలీల్…గత ఎన్నికల దగ్గర నుంచి సైలెంట్ అయ్యారు. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జలీల్..తర్వాత టీడీపీలో చేరి రాజకీయం చేస్తూ వస్తున్నారు.

అయితే గత ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా…తన కుమార్తె షబానాని పోటీకి దింపారు. కానీ తక్కువ మెజారిటీతో ఆమె, వెల్లంపల్లి శ్రీనివాస్ చేతిలో ఓడిపోయారు. ఓడిపోయాక షబానా విదేశాలకు వెళ్లిపోగా, జలీల్ ఏమో రాజకీయాల్లో కనిపించడం మానేశారు. దీంతో వెస్ట్‌లో టీడీపీకి సరైన నాయకుడు లేకుండా పోయారు. దీంతో వెస్ట్‌పై చాలామంది నేతల కన్ను పడింది. ఇప్పటికే ఆ సీటు దక్కించుకోవాలని నాగుల్ మీరా గట్టిగానే ట్రై చేస్తున్నారు. అటు బుద్దా వెంకన్న లైన్‌లో ఉన్నారు.

అయినా సరే చంద్రబాబు వెస్ట్ సీటు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక జలీల్ రాజకీయాల్లో కనిపించకపోయే సరికి…ఆ సీటు వేరే వాళ్ళకు ఇచ్చేస్తారని ప్రచారం జరిగింది. ఈ క్రమంలో తాజాగా జలీల్ మళ్ళీ తెరపైకి వచ్చారు. రావడం రావడమే వైసీపీపై ఫైర్ అయ్యారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలపై విమర్శలు చేశారు. అలాగే వెల్లంపల్లికి గట్టిగా కౌంటర్లు ఇచ్చారు.


అయితే సడన్‌గా జలీల్ ఫీల్డ్‌లోకి దిగడానికి కారణాలు లేకపోలేదు. సీటు పోతుందనే ఉద్దేశంతోనే జలీల్ మళ్ళీ యాక్టివ్ అయినట్లు తెలుస్తోంది. కాకపోతే ఇకనుంచైనా యాక్టివ్ గా ఉంటారా లేదా అనేది చూడాలి. లేదంటే వెస్ట్ సీటులో కొత్త నాయకుడు రావొచ్చు. అదే సమయంలో నెక్స్ట్ జనసేన తో గానీ పొత్తు ఉంటే…ఈ సీటుని జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. చూడాలి మరి వెస్ట్ సీటులో ఎన్ని ట్విస్ట్‌లు వస్తాయో.

Discussion about this post