టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఇప్పుడు బెజవాడ రాజకీయాల్లో యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న జలీల్..ఈ మధ్య కాస్త మీడియా ముందు ఎక్కువ కనిపిస్తున్నారు. వైసీపీపై విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలకు కౌంటర్లు ఇస్తున్నారు. అయితే ఇప్పటివరకు సైలెంట్‌గా ఉన్న జలీల్ ఇప్పుడు యాక్టివ్ అవ్వడానికి కారణం వెస్ట్ సీటు.

ఈ సీటు తన చేతుల నుంచి చేజారిపోకుండా చూసుకోవాలని జలీల్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జలీల్..2014లో వెస్ట్‌లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచి, ఆ తర్వాత టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2019 ఎన్నికల్లో తన కుమార్తెని వెస్ట్ బరిలో నిలబెట్టారు. కానీ ఆమె ఓడిపోయి విదేశాలకు వెళ్ళిపోయారు. దీంతో వెస్ట్ సీటులో టీడీపీ నాయకులు లేకుండా పోయారు. జలీల్ సైతం యాక్టివ్‌గా పనిచేయలేదు.అయితే ఈ సీటు కోసం బుద్దా వెంకన్న, నాగుల్ మీరా లాంటి వారు గట్టిగానే ట్రై చేశారు. కానీ చంద్రబాబు ఎవరిని కాదని, వెస్ట్‌కు సమన్వయకర్తగా ఎంపీ కేశినేని నానిని నియమించారు. దీంతో సీటు ఎవరికి దక్కదని అర్ధమైపోయింది. ఎన్నికల సమయంలో పరిస్తితుల బట్టి వెస్ట్‌లో అభ్యర్ధిని పెట్టడం గాని లేదంటే పొత్తు ఉంటే ఈ సీటు జనసేనకు కేటాయించాలనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.

కానీ సీటు ఎవరికి పోనివ్వకూడదని జలీల్ అనుకుంటున్నారు…తన సొంత సీటుని వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరు. దీంతో ఇప్పుడు నియోజకవర్గంలో యాక్టివ్‌గా పనిచేయడం మొదలుపెట్టారు. అలాగే మీడియా ముందుకు ఎక్కువ వస్తున్నారు. వైసీపీపై గట్టిగానే ఫైర్ అవుతున్నారు.ఇక ఈ కార్యక్రమాలన్నీ చంద్రబాబు దృష్టిలో పడి, తన సీటుని కాపాడుకోవడానికే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పొత్తు ఉంటే మాత్రం…ఈ సీటు ఖచ్చితంగా జనసేనకు అప్పగించేలా ఉన్నారు. ఒకవేళ పొత్తు లేకపోతే జలీల్‌కు ఏమన్నా ఛాన్స్ ఇస్తారేమో..లేదంటే జలీల్‌కు సీటు దక్కడం కష్టమే.

Discussion about this post