Site icon Neti Telugu

జమ్మలమడుగులో వైసీపీకి షాక్..టీడీపీదే ఛాన్స్!

వైసీపీ కంచుకోటల్లో కడప జిల్లాలో ఉన్న జమ్మలమడుగు కూడా ఒకటి అని చెప్పాలి. మామూలుగానే కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా..ఈ జిల్లాలో పది సీటు వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. అయితే నిదానంగా కడపలో పరిస్తితులు మారుతూన్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత, వర్గ పోరు వల్ల మైనస్ పెరుగుతుంది..టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. ఇప్పుడు జమ్మలమడుగులో కూడా అదే పరిస్తితి కనిపిస్తుంది.

గత రెండు ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైసీపీ గెలిచింది. 2014లో వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత టి‌డి‌పిలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ మంత్రిగా చేశారు. 2019 ఎన్నికల్లో ఆదినారాయణ కడప ఎంపీగా, రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు నుంచి పోటీ చేశారు. కానీ ఇద్దరు ఓడిపోయారు. జమ్మలమడుగులో వైసీపీ నుంచి సుధీర్ రెడ్డి గెలిచారు.

ఈ నాలుగేళ్లలో సుధీర్ పెద్దగా ప్రజా బలం పెంచుకోలేదు. ఆయనపై నిదానంగా వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వ పథకాలు తప్ప..జమ్మలమడుగులో చేసిన అభివృద్ధి పెద్దగా లేదు. ఇక స్టీల్ ప్లాంట్‌కు శంఖుస్థాపనలు తప్ప..దాన్ని పూర్తి చేసిన పరిస్తితి లేదు. అదే సమయంలో అక్కడ వర్గ పోరు కూడా పెరిగింది. టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వచ్చిన రామసుబ్బారెడ్డి వర్గాన్ని సుధీర్ రెడ్డి పట్టించుకోలేదు.

దీంతో సుబ్బారెడ్డి వర్గం సెపరేట్ గా రాజకీయం చేస్తుంది. పైగా ఇటీవల ఆయనకు ఎమ్మెల్సీ దక్కింది..దీంతో సుబ్బారెడ్డి వర్గం ఫుల్ యాక్టివ్ గా ఉంది. అటు గత ఎన్నికల్లో సుధీర్ విజయానికి కృషి చేసిన శేఖర్ రెడ్డిని సైతం సైడ్ చేశారు. సుధీర్ ఏ మాత్రం శేఖర్‌ని పట్టించుకోలేదు. దీంతో శేఖర్ సైతం సెపరేట్ గా రాజకీయం చేస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి మైనస్ గా మారుతున్నాయి. టీడీపీకే పెద్ద ప్లస్ అవుతున్నాయి. టి‌డి‌పి లో భూపేష్ రెడ్డి యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఇక బి‌జే‌పి నుంచి టి‌డి‌పిలోకి వచ్చి ఆదినారాయణ జమ్మలమడుగులో పోటీ చేయాలని చూస్తున్నారు. చూడాలి మరి ఈ సారి జమ్మలమడుగులో ఎవరు పైచేయి సాధిస్తారో. 

Exit mobile version