ఏపీ రాజకీయాల్లో పొత్తులు రెడీ అయ్యాయి..టీడీపీతో పొత్తుకు ఇటు జనసేన, అటు సిపిఐ సైతం సిద్ధమయ్యాయి. ఇప్పుడు బంతి టిడిపి కోర్టులో ఉంది. టిడిపి పొత్తులపై ఎలా ముందుకెళుతుందనేది చూడాల్సి ఉంది. ఎందుకంటే పొత్తు పెట్టుకుంటే సీట్లు త్యాగాలు చేయాల్సింది టిడిపినే. ఎందుకంటే టిడిపికి 175 స్థానాల్లో బలం ఉంది..జనసేనకు అలా లేదు..కేవలం కొన్ని జిల్లాల్లో కొన్ని సీట్లలోనే బలం ఉంది. ఇటు సిపిఐకి ఏదో నాలుగైదు స్థానాల్లో గెలుపుని ప్రభావితం చేసే ఛాన్స్ ఉంది.

అంటే ఇక్కడ పొత్తు తేల్చాల్సింది చంద్రబాబు..తాజాగా జనసేన ఆవిర్భావ సభలో పవన్..టిడిపితో పొత్తుకు రెడీ అని పరోక్షంగా చెప్పేశారు. వైసీపీ ఏదైతే అనుకుంటుందో అది జరగనివ్వను అని అన్నారు. ఓట్లని వృధాగా పోనివ్వను అని, ప్రయోగాల జోలికి వెళ్లనని అన్నారు. ఒంటరిగా గెలుస్తామని ఎప్పుడు నమ్మకం వస్తే అప్పుడే ఒంటరి పోరుకు రెడీ అని అంటున్నారు. అంటే ఇప్పుడు పొత్తు వైపే మొగ్గు చూపుతున్నారని అర్ధమవుతుంది. పైగా బిజేపితో పొత్తు ఉన్నా సరే కలిసి పనిచేసే విషయంలో బిజేపి సహకరించలేదని చెప్పేశారు. దీని బట్టి చూస్తే బిజేపికి గుడ్ బై చెప్పేసి టిడిపితో కలుస్తారని అర్దమవుతుంది.

అటు టిడిపితో ఎప్పటినుంచి సిపిఐ కలిసి ప్రజా పోరాటాలు చేస్తుంది. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ అవగాహనకు వచ్చారు. వచ్చే ఎన్నికల్లో టిడిపితో కలిసి పోటీ చేస్తామని తాజాగా సిపిఐ రామకృష్ణ చెప్పారు. అంటే టిడిపితో కలవడానికి జనసేన-సిపిఐ రెడీ అయిపోయాయి. మరి పొత్తుపై స్పందించాల్సింది టిడిపి మాత్రమే..పొత్తులపై చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నారు..ఎలా ముందుకెళ్తారనేది చూడాలి..అసలు పొత్తు పెట్టుకుంటారో లేదో చూడాలి.