రాజకీయాల్లో ఏ నాయకుడైన ప్రజల నుంచే వస్తారు..అలా ప్రజల నుంచి వచ్చిన నాయకుడు ప్రజల్లో ఉంటూ పనిచేయాలి..అలా చేయకపోతే ప్రజలే ఆ నాయకుడుని పక్కనబెట్టేస్తారు. త్వరలోనే ఈ పరిస్తితి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికే వచ్చేలా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా….పాదయాత్ర పేరిట ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. కానీ గెలిచి అధికారంలోకి వచ్చాక ప్రజల్లోకి వచ్చింది తక్కువ. అయితే తాడేపల్లిలోని ఇంటికి లేదా పక్కనే ఉన్న సచివాలయాలనికే జగన్ పరిమితం అవుతూ వస్తున్నారు.

రెండున్నర ఏళ్లలో ఆయన ప్రజల్లోకి వచ్చిన సందర్భాలు తక్కువ. ఏదైనా ఫంక్షన్లు ఉంటే బయటకు రావడం లేదా అప్పుడప్పుడు పథకాల ప్రారంభోత్సవానికి బయటకు రావడం తప్ప…పెద్దగా జనాల్లోకి ఎప్పుడు రాలేదు. ఇక తాజాగా వరదల వల్ల రాయలసీమ జిల్లాలు తీవ్రంగా నష్టపోయాయి. ప్రాణ, ఆస్తి, పంట నష్టాలు భారీగా జరిగాయి. ఇక సీఎం సొంత జిల్లా కడపలో కూడా అదే పరిస్తితి.

కానీ జగన్ జిల్లాల పర్యటనకు వెళ్లలేదు. ఏదో ఒకరు హెలిప్యాడ్‌లో ఏరియల్ సర్వే చేసి చేతులు దులుపుకున్నారు. ఆ తర్వాత తెలంగాణలో ఏదో పెళ్లి ఫంక్షన్‌కు వెళ్లారు. నెక్స్ట్ తాడేపల్లి ఇంటికి, అసెంబ్లీ సమావేశాలకు పరిమితమయ్యారు. కనీసం జిల్లాల పర్యటనకు వెళ్లకపోవడంపై..ఆయా జిల్లా ప్రజలు జగన్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అటు ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం వెళ్ళి వరద బాధితులని పరామర్శించారు.

కానీ జగన్ మాత్రం ఎందుకు వెళ్లలేదంటే..ఏదో సాకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాను వెళితే…అధికారుల ఫోకస్ అంతా తనపై ఉంటుందని, అప్పుడు పనులు జరగవని, అందుకే వెళ్లలేదని చెబుతున్నారు. ఎక్కడైనా సీఎం స్వయంగా వెళితే పనులు ఇంకా ఎక్కువ జరుగుతాయి. క్షేత్ర స్థాయిలో పరిస్తితులు ఎలా ఉన్నాయో తెలుస్తాయి. చంద్రబాబు సీఎంగా ఉండగా….స్వయంగా ఆయనే రంగంలోకి పనులు త్వరగా చేయించేవారు. కానీ ఇప్పుడు వెళ్లకపోగా, ఏదో కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కవర్ చేసుకుంటే జనంలో అసంతృప్తి పెరుగుతుంది తప్ప…తగ్గదు.

Discussion about this post