ఏపీ అధికార పార్టీ వైసీపీలో జనసేన అంటే భయం పట్టుకుందా? ఆ పార్టీ నాయకుడు అంటే.. ఒకింత ఆందోళనగా ఉందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. గతానికి బిన్నంగా.. ఇప్పుడు జనసేన కార్యక్రమాలను పూర్తిగా పర్యవేక్షిస్తుండడం.. ఆ పార్టీ అధినేత పవన్ ను విమర్శించడం.. ఆయన ఇంకా ఏమీ అనకముందే.. తాము ఫైర్ అవడం.. వంటివి వైసీపీలో కామన్ అయ్యాయి. వాస్తవానికి.. బలమైన ప్రతిపక్షంగా ఉంటే.. ఓకే. కానీ.. అలా జనసేన కనిపిస్తోందా? అనేది ప్రశ్న.

గత 2019 ఎన్నికల్లో జనసేనకు వచ్చిన ఓటు బ్యాంకు 7 శాతం మాత్రమే. ఇక, ఉప ఎన్నికల్లో ఆ పార్టీ చేసిన ప్రచారం కూడడా ఫలించలేదు. స్థానికంగా.. కొన్ని వార్డు, పంచాయతీ సీట్లు మాత్రమే గెలిచింది. దీనిని బట్టి.. అసలు.. వైసీపీ జనసేన గురించిన భయపడాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పుడున్న పరిస్థితి అలా లేదు. జనసేనను చూసి వైసీపీ బయపడుతోందనే ట్రోల్స్ పెరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? ఎందుకు? అనేది కూడా ఆసక్తిగా మారింది.

గత ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న కాపు సామాజిక వర్గం..వచ్చే ఎన్నికల్లో పవన్‌కు అనుకూలంగా ఉంటుందని.. ఇది ఖాయమని పేర్కొంటూ.. ఇటీవల ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికలోకుండబద్దలు కొట్టినట్టు వైసీపీ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. ఇదే జరిగితే.. తమకు ముప్పు తప్పదని.. భావిస్తున్న వైసీపీ.. ఎదురు దాడి చేయడం ద్వారా.. పవన్‌ను నైతికంగా.. ఆ వర్గానికి దూరం చేయాలని భావిస్తున్నట్టు కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

అయితే.. నిజానికి పవన్‌పై కామెంట్లు చేసే క్రమంలో అనూహ్యంగా వైసీపీలోనే ఇరకాటంలో పడుతోందని చెబుతున్నారు. గతం నుంచి ఇప్పటి వరకు పవన్ గురించి ఎలాంటి ప్రచారం జరిగినా.. ఆయనకు , ఆయన పార్టీ కి ఇబ్బంది లేదు. ఎందుకంటే.. అధికారం పరమావధిగా.. జనసేన రాజకీయం చేయడం లేదు. సో.. రేపు ఇంకోసారి.. పవన్ పార్టీ పిల్లిమొగ్గలు వేసి.. ఒక్క స్థానానికే పరిమితం అయినా.. పవన్ వెళ్లి సినిమాలు చేసుకుంటాడు. మరి పవన్ చేస్తున్న సీబీఐ దత్తపుత్రుడు.. అనే కామెంట్లు ప్రజల్లోకి వెళ్తే.. వైసీపీ పరిస్థితి దారుణం అవుతుందని అంటున్నారు.

Discussion about this post