ఏపీ రాజకీయాల్లో జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకే ఎక్కువ రిస్క్ ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు కనిపించేది ఏముంది…గత ఎన్నికల్లో జనసేన వల్లే కదా టీడీపీకి ఎక్కువ నష్టం జరిగింది..జనసేన అనూహ్యంగా ఓట్లు చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరగడం, వైసీపీకి లాభం జరగడం జరిగింది. అయితే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన వల్ల మళ్ళీ టీడీపీకే నష్టం ఎక్కువ కనిపిస్తోంది. విడిగా పోటీ చేసిన, కలిసి పోటీ చేసిన సరే ఇబ్బంది ఉందనే చెప్పొచ్చు.

విడిగా పోటీ చేస్తే నష్టం ఏంటో అందరికీ తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చుతుంది…అసలు జనసేన గెలవదు…టీడీపీని గెలవనివ్వదు. అదే పరిస్తితి కనిపించింది. దాదాపు 50 నియోజకవర్గాల్లో ఈ పరిస్తితి కనిపించిందని చెప్పొచ్చు. విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన వల్ల టీడీపీకి పెద్ద బొక్క పడింది. అలాగే వైసీపీకి బాగా బెనిఫిట్ అయింది.

ఇక అలాంటి నష్టం జరగకూడదని చెప్పి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే..పవన్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. అటు పవన్ సైతం పొత్తుకు పరోక్షంగా రెడీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పొత్తు ఉంటే టీడీపీకి లాభం ఎంత ఉంటుందో..నష్టం కూడా అంతే ఉండొచ్చు. పొత్తు వల్ల గెలిచి అధికారంలోకి రావొచ్చు…అదే సమయంలో కొన్ని నియోజకవర్గాలని టీడీపీ నష్టపోవాల్సి వస్తుంది.

పొత్తులో భాగంగా జనసేనకు కొన్ని సీట్లు వదులుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆ సీట్లలో టీడీపీ నేతలకు ఇబ్బందికర వాతావరణం వస్తుంది. వారికి రాజకీయంగా ఇబ్బందులు వస్తాయి. జనసేనకు సీట్లు ఇస్తే…ఆ సీట్లలో జనసేన రాజకీయంగా బలపడుతుంది…అప్పుడు టీడీపీ బలం తగ్గుతుంది. పైగా సీట్లు దక్కని టీడీపీ నేతలు వేరే పార్టీ వైపు చూస్తే పార్టీకి ఇంకా నష్టం జరుగుతుంది. అంటే ఎటు చూసుకున్న జనసేన వల్ల టీడీపీకి రిస్క్ ఎక్కువే కనిపిస్తోంది.

Discussion about this post