రాష్ట్ర రాజకీయాల్లో బలమైన ఫ్యామిలీల్లో జేసీ కుటుంబం కూడా ఒకటి…ఈ ఫ్యామిలీ అనంతపురం రాజకీయాలని బాగా ప్రభావితం చేయగలదు..ఎన్నో దశాబ్దాలు నుంచి అనంతలో కీలక పాత్ర పోషిస్తుంది. 2014 వరకు ఓటములు ఎరగని జేసీ ఫ్యామిలీకి..2019 ఎన్నికల్లో ఓటమి ఎదురైన విషయం తెలిసిందే…ఇక ఆ ఓటమికి రివెంజ్ తీర్చుకోవడమే లక్ష్యంగా జేసీ ఫ్యామిలీ ముందుకెళుతున్న విషయం తెలిసిందే…ఈ సారి ఎలాగైనా సత్తా చాటాలని చూస్తుంది. అయితే ఈ సారి జేసీ ఫ్యామిలీ విజయం అందుకునేలా ఉంది
.

కాకపోతే జేసీ ఫ్యామిలీ నుంచి ఎవరు విజయం అందుకుంటారనేది మొన్నటివరకు క్లారిటీ లేదు…అయితే ఇప్పుడు చంద్రబాబు, జేసీ ఫ్యామిలీకి దాదాపు క్లారితే ఇచ్చేశారని తెలుస్తోంది. గత ఎన్నికల్లో తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి మాత్రం అస్మిత్‌ని కాకుండా ప్రభాకర్ రెడ్డిని డైరక్ట్‌గా తాడిపత్రి బరిలో నిలబెడతారని తెలుస్తోంది.

ఎలాగో తాడిపత్రి మున్సిపాలిటీని గెలిపించారు…కాబట్టి ప్రభాకర్ రెడ్డి అయితేనే తాడిపత్రి అసెంబ్లీలో కూడా సత్తా చాటుతారని బాబు భావిస్తున్నారట. అందుకే తాడిపత్రి సీటు ప్రభాకర్ రెడ్డికే ఫిక్స్ చేస్తున్నారట. ఇక జేసీ దివాకర్ రెడ్డి తనయుడు పవన్ రెడ్డి..గత ఎన్నికల్లో అనంత ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు…అయితే ఈ సారి ఆయన అనంత అర్బన్ అసెంబ్లీలో పోటీ చేస్తారని ప్రచారం జరిగింది..మళ్ళీ అనంత ఎంపీ సీటులో పోటీ చేయడానికి పవన్ సిద్ధంగా లేరని ప్రచారం జరిగింది.

కానీ వాస్తవ పరిస్తితులని చూసుకుంటే వేరుగా ఉన్నాయి..మళ్ళీ పవన్‌ని అనంత పార్లమెంట్ లోనే పోటీకి దింపుతారని తెలుస్తోంది. పార్లమెంట్ సీటులో దింపితే…అసెంబ్లీ స్థానాలపై జేసీ ఫ్యామిలీ ప్రభావం ఉంటుందని, కాబట్టి పవన్‌ని పార్లమెంట్ సీటులోనే నిలబెడతారని తెలుస్తోంది. ఇందులో కూడా ఎలాంటి డౌట్ లేదనే చెబుతున్నారు. మొత్తానికి జేసీ ఫ్యామిలీ నుంచి ప్రభాకర్ రెడ్డి, పవన్ రెడ్డి పోటీకి దిగనున్నారు.


Discussion about this post