అనంతపురం జిల్లాలో జేసీ ఫ్యామిలీ పొజిషన్ ఏంటో అందరికీ తెలిసిందే…రాజకీయంగా చాలా బలమైన కుటుంబం..ఎన్నో దశాబ్దాల నుంచి అనంత రాజకీయాల్లో కీలకంగా పనిచేస్తున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ లో, ఇప్పుడు టీడీపీలో కీలకపాత్ర పోషిస్తున్నారు…అయితే ఎప్పుడు జేసీ ఫ్యామిలీకి ఓటమి తెలియదనే చెప్పాలి…కానీ గత ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఓటమి ఎదురైంది..తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి ఓడిపోగా, అనంతపురం పార్లమెంట్ లో జేసీ పవన్ ఓడిపోయారు.

ఇలా వారసులు ఇద్దరు ఓడిపోవడంతో జేసీ బ్రదర్స్ మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు..ముఖ్యంగా జేసీ ప్రభాకర్ రెడ్డి…తమ కంచుకోట తాడిపత్రిని మళ్ళీ దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు..ఇప్పటికే అక్కడ టీడీపీ లీడ్ పెరిగిన విషయం తెలిసిందే…ఇక నెక్స్ట్ ఎన్నికల్లో అస్మిత్ కాకుండా ప్రభాకర్ రెడ్డి డైరక్ట్ తాడిపత్రి బరిలో దిగే అవకాశాలు ఉన్నాయి. చంద్రబాబు సైతం…ప్రభాకర్ రెడ్డి బరిలో దిగితే బెటర్అని చెబుతున్నారట.

ఇక తాడిపత్రి సీటు విషయంలో క్లారిటీ ఉంది గాని…జేసీ పవన్ సీటు విషయంలో క్లారిటీ రావడం లేదు..ఈయన మళ్ళీ పార్లమెంట్ సీటులో పోటీ చేస్తారా? లేక వేరే సీటుకు ఏమైనా మారతారా? అనేది క్లారిటీ లేదు. వాస్తవానికి అనంతపురం జిల్లాలో ఉన్న అనంత, హిందూపురం పార్లమెంట్ సీట్లలో ఈ సారి బీసీ అభ్యర్ధులని నిలబెట్టాలని చంద్రబాబు యోచిస్తున్నారు..అదే జరిగితే జేసీ పవన్ కు పార్లమెంట్ సీటులో అవకాశం దక్కదు. అదే సమయంలో పవన్ సైతం..అనంతపురం అర్బన్ సీటులో పోటీ చేయాలని ఆసక్తిగా ఉన్నారట.

అర్బన్ సీటులో జేసీ ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది..దీంతో అక్కడే పోటీ చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారట..కానీ అక్కడ టీడీపీ తరుపున ప్రభాకర్ చౌదరీ పనిచేస్తున్నారు…2014లో ఆయనే టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలవగా, 2019 ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత నుంచి అర్బన్ లో పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ బరిలో దిగాలని చూస్తున్నారు. మరి అలాంటప్పుడు అర్బన్ సీటు పవన్ కు ఇస్తారో లేదో చెప్పలేం. చూడాలి మరి చివరికి పవన్ ఎక్కడ పోటీ చేస్తారో?

Discussion about this post