జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్న..ఆ నిర్ణయంలో ఏదొక వివాదం ఉండక మానదు..అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస…ఏ ఒక్క నిర్ణయం కూడా సవ్యంగా అమలు అవ్వదు. ఇటీవల జిల్లాల విభజన చేశారు…ఇదేమన్న సవ్యంగా చేశారా అంటే? లేదనే చెప్పాలి. జిల్లాల విభజన అనేది మంచి అంశమే..కానీ దీనిలో కూడా ఏదొక వివాదం వచ్చేలా చేశారు. సరిగ్గా విభజన చేయకపోవడంతో ఇప్పుడు ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయి.

అసలు జిల్లాల విభజనపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు..ఏదో రెండు, మూడు రోజులు ఆందోళన చేసి ఆగడం లేదు…ఎప్పుడైతే జిల్లాలని ప్రకటించారో అప్పటినుంచి ప్రజలు ఈ అంశంపై పోరాటం చేస్తున్నారు…ఈ జిల్లాల విభజన సరిగ్గా లేదని పలు జిల్లాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. హిందూపురం పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లా చేశారు…ఇది బాగానే ఉంది..కానీ జిల్లా కేంద్రంగా హిందూపురంని పెట్టకుండా పుట్టపర్తిని పెట్టారు…దీనిపై రగడ నడుస్తోంది.

అటు ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ని రద్దు చేయడంపై ఆందోళన జరుగుతుంది. ఇక సీఎం సొంత జిల్లా కడపలోని రాజంపేట పార్లమెంట్‌ని అన్నమయ్య జిల్లాగా చేశారు. ఈ జిల్లా కేంద్రంగా రాజంపేటని కాకుండా రాయచోటిని పెట్టారు..దీనిపై రాజంపేట ప్రజలు ఉద్యమం చేస్తున్నారు. ఇటు మదనపల్లెని సెపరేట్‌గా జిల్లా చేయాలని ఉద్యమం నడుస్తోంది. అటు నరసాపురం పార్లమెంట్‌ని ప్రత్యేకంగా జిల్లా చేసి భీమవరంని జిల్లా కేంద్రంగా పెట్టారు..దీనిపై నరసాపురం ప్రజలు ఆందోళన చేస్తున్నారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక కొన్ని నియోజకవర్గాలని వేరే జిల్లాల్లో కలపాలని డిమాండ్ వస్తుంది…బాపట్లలో కలిసిన అద్దంకిని..ఒంగోలు కలపాలని డిమాండ్ వస్తుంది. అటు నెల్లూరులో కలిసిన కందుకూరుని…ఒంగోలులో కలపాలని ప్రజలు పోరాటం చేస్తున్నారు. అలాగే అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా ఉన్న కందుకూరుని రద్దు చేయడంపై నిరసనలు వస్తున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల విభజనపై పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి.

Discussion about this post