గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. అందులో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలోకి జంప్ చేశారు. దీంతో టీడీపీకి 19 సీట్లు ఉన్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లలో టిడిపి మళ్ళీ గెలుస్తుందా? అంటే చెప్పడం కాస్త కష్టమనే చెప్పాలి. 23 సీట్లలో మళ్ళీ పూర్తిగా గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని సిట్టింగ్ సీట్లని కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
అందులో కాస్త వింత పరిస్తితి ఏంటంటే జంపిగ్ అయిన ఎమ్మెల్యేలకు గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇటీవల వచ్చిన ఓ సర్వే స్పష్టం చేస్తుంది. ఆ సర్వేలో టిడిపికి ఆధిక్యం ఉన్నా సరే..కొన్ని సిట్టింగ్ సీట్లని కోల్పోయే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. అలా కోల్పోయే సీట్లలో విశాఖ నార్త్, విశాఖ సౌత్, మండపేట, రాజమండ్రి రూరల్, గన్నవరం సీట్లు ఉన్నాయి. ఇక టెక్కలి, గుంటూరు వెస్ట్, చీరాల సీట్లలో టఫ్ ఫైట్ ఉంది.

అయితే మండపేట టిడిపికి కంచుకోట. కానీ ఇప్పుడు అది వైసీపీ ఖాతాలో పడుతుందని తేలింది. ఇటు రాజమండ్రి రూరల్ సీటులో జనసేన గెలుస్తుందని సర్వే తేల్చి చెప్పడం ఆసక్తిగా మారింది. విశాఖ నార్త్ సైతం, సౌత్ సైతం వైసీపీనే గెలుచుకోనుందని చెప్పింది. అటు గన్నవరం కూడా టిడిపి నుంచి చేజారనుంది. అయితే టెక్కలిలో టఫ్ ఫైట్ ఉన్నా సరే కాస్త టిడిపికే ఎడ్జ్ ఉంది. అయితే వీటిల్లో జంపింగ్ ఎమ్మెల్యేలు ఉన్న స్థానాలు వచ్చి విశాఖ నార్త్, గన్నవరం, గుంటూరు వెస్ట్, చీరాల..ఈ సీట్లలో జంపింగ్ ఎమ్మెల్యేలకు మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వే తేల్చడం విశేషం.
అయితే టిడిపితో గాని జనసేన పొత్తు ఉంటే ఒక్క గన్నవరం మినహా మిగిలిన సీట్లలో జంపింగ్ ఎమ్మెల్యేలు గెలవడం కష్టమనే చెప్పవచ్చు.
