ఇటీవల చంద్రబాబు..తెలుగుదేశం పార్టీలో ఊహించని మార్పులు చేస్తున్న విషయం తెలిసిందే. పార్టీ మళ్ళీ ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా పనిచేస్తున్న బాబు..పార్టీని ప్రక్షాళన చేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో పలు మార్పులు చేశారు. అసలు పార్టీలో ఏ మాత్రం పనిచేయని నాయకులని పక్కన పెట్టేస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో నేతలని సైడ్ చేసేశారు..కొత్త అభ్యర్ధులని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇలా పలు నియోజకవర్గాల్లో మార్పులు చేశారు.

అయితే సైడ్ అయిన నేతలు ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నారు. పార్టీలో యాక్టివ్‌గా పనిచేయడం లేదు. ఇక వారికి చంద్రబాబు ఏమైనా హామీలు ఇచ్చారా? లేక అలా వదిలేశారా? అనేది క్లారిటీ లేదు. పార్టీ అధికారంలోకి వస్తే ఏమన్నా పదవులు ఇస్తామని హామీ ఇస్తే సరే…లేదంటే వారు రాజకీయంగా వేరే ఆప్షన్ చూసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఉదాహరణకు పామర్రులో మొన్నటివరకు ఉప్పులేటి కల్పన టీడీపీ బాధ్యతలు చూసుకునేవారు..అయితే ఆమె యాక్టివ్‌గా లేకపోవడంతో వర్ల రామయ్య తనయుడు కుమార్ రాజాని తీసుకొచ్చి ఇంచార్జ్‌గా పెట్టారు. కొత్త ఇంచార్జ్ వచ్చిన దగ్గర నుంచి కల్పన అడ్రెస్ లేరు. అయితే ఆమె వైసీపీలో చేరేందుకు చర్చలు కూడా చేస్తున్నట్లు పామర్రు రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. ఇటు నరసాపురంలో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడుని సైడ్ చేసి, రామాంజనేయరాజుని ఇంచార్జ్‌గా పెట్టారు. దీంతో బండారు పోలిటికల్ కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది.


అలాగే మాడుగుల నియోజకవర్గంలో సరిగ్గా పనిచేయడం లేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడుని పక్కన పెట్టి పీవీజీ కుమార్‌ని ఇంచార్జ్‌గా పెట్టారు. మరి గవిరెడ్డి రాజకీయంగా ఎలా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. అటు సాలూరులో రాజేంద్ర ప్రతాప్‌ని పక్కన పెట్టేశారు. ఆయన స్థానంలో గుమ్మడి సంధ్యారాణిని ఇంచార్జ్‌గా పెట్టారు. ఇంచార్జ్ పదవి పోయాక రాజేంద్ర సైతం సైలెంట్ అయిపోయారు. ఇలా పార్టీ ఇంచార్జ్ పదవుల నుంచి తప్పుకున్న నేతలు రాజకీయంగా ఎలా ముందుకెళ్తారో చూడాల్సి ఉంది.


Discussion about this post