రాజకీయాల్లో కొందరు నాయకులు ఏం చెప్పిన అవి నమ్మశక్యంగా ఉండవనే చెప్పాలి. ముఖ్యంగా అవసరానికి తగ్గట్టుగా పార్టీల మారే వారి మాటలని ప్రజలు నమ్మడం కష్టం. అలా అవసరాలకు తగ్గట్టుగా పార్టీ మారిన నాయకుల్లో జూపూడి ప్రభాకర్ రావు కూడా ఒకరు అని చెప్పవచ్చు. మొదట కాంగ్రెస్, తర్వాత వైసీపీ..ఇక టిడిపి అధికారంలోకి రావడంతో ఇటు వచ్చేశారు. అప్పుడు జగన్ పై ఎలాంటి విమర్శలు చెప్పాల్సిన పని లేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో జూపూడి వైసీపీలోకి వచ్చేశారు. ఇప్పుడు ఆయన చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారు.

తాజాగా యర్రగొండపాలెం ఇష్యూపై మాట్లాడారు. అక్కడ రచ్చకు కారణం వైసీపీ, మంత్రి సురేశ్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయినా సరే చంద్రబాబు కారణమని అబద్దం చెప్పారు. ఇక యథావిధిగా బాబు దళిత ద్రోహి అన్నారు. ఇక లోకేశ్…దళితులు పీకింది ఏమి లేదని అన్నారని, చంద్రబాబు..దళితులుగా ఎందుకు పుట్టాలని అనుకుంటారని అన్నారని లేనిపోని అబద్దాలు చెప్పారు. అసలు జగన్..దళితులకు పీకింది ఏమి లేదని అన్నారు..బాబు ఏమో దళితులని ఉద్దేశించి మంచిగానే చెప్పారు. ఆ కానీ మాటలని వైసీపీ వక్రీకరిస్తుంది. జూపూడి అదే పనిచేశారు. పైగా బాబు ఎక్కడకు వెళ్ళిన దళితులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అసలు పార్టీలు మారే జూపూడి నీతులు వినడానికి ఎవరు రెడీగా లేరు. ఇక ఆయన చెబితే..దళితులు బాబుని అడ్డుకోవడం అనేది జరిగే పని కాదు. ఇక రాష్ట్రంలో 29 ఎస్సీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో ఒక్క సీటు కూడా టిడిపి గెలవదని చిలుక జోస్యం చెప్పారు.
గత ఎన్నికల్లో అంటే వైసీపీ హవా నడిచింది..కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులకు ఒరిగింది ఏమి లేదు..పైగా దాడులు, హత్యలు జరిగాయి. దీంతో దళిత వర్గాలు వైసీపీపై ఆగ్రహంతో ఉన్నారు. అలాగే ఎస్సీ సీట్లలో ఈ సారి టిడిపి సత్తా చాటడం