ముద్రగడ పద్మనాభం..ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేదు..అయితే కాపు ఉద్యమం అంటూ టిడిపి అధికారంలో ఉండగా పోరాటాలు చేసిన ఈయన కాపు వర్గానికి గుర్తు ఉంటారో లేదో గాని..టిడిపి వాళ్ళకు మాత్రం బాగా గుర్తు ఉంటారు. ఎందుకంటే కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం పేరుతో ముద్రగడ టిడిపిని దెబ్బతీయడానికి చేసిన రాజకీయమే ఎక్కువ. కాపుల కోసం ఎంతోకొంత మేలు చేసేలా చంద్రబాబు పనిచేశారు. అలాగే కేంద్రం అగ్రవర్ణాల పేదల కోసం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో కాపుల కోసం 5 శాతం కేటాయించారు.
అయినా బాబుని దెబ్బతీసి..జగన్‌ని గెలిపించడం కోసం ముద్రగడ కాపు ఉద్యమం అంటూ రాజకీయ ఉద్యమమే నడిపారు. ఒకవేళ చిత్తశుద్ధితో కాపు రిజర్వేషన్ల కోసం పొరాడి ఉంటే..జగన్ అధికారంలోకి వచ్చాక కూడా పోరాడాలి. కానీ జగన్ అధికారంలోకి రాగానే ముద్రగడ సైడ్ అయిపోయారు. పైగా బాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లని సైతం జగన్ కొనసాగించలేదు. అయినా ముద్రగడ పోరాటం లేదు.

అంటే ముద్రగడ రాజకీయ ఎజెండా ఏంటి అనేది క్లియర్ గా అర్ధమవుతుంది. అయితే ఇప్పుడు తనకున్న ముసుగుని తొలగించి వైసీపీలో చేరేందుకు ముద్రగడ రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఈయన వైసీపీలో చేరతారని తెలుస్తోంది. అలాగే ఈయన నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారని ప్రచారం వస్తుంది.
పిఠాపురం నియోజకవర్గం నుంచి ముద్రగడ పోటీ చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ అక్కడ నుంచి పోటీ చేసిన..లేదా గోదావరి జిల్లాల్లో ఎక్కడ నుంచి పోటీ చేసిన..టిడిపి-జనసేన పొత్తు ఉండటంతో..ముద్రగడ గెలవడం కష్టమనే చెప్పవచ్చు. అలాగే ఆయనపై కాపుల్లో కూడా యాంటీ ఉంది. కాబట్టి ముద్రగడ గెలిచే అవకాశాలు లేవు.