వచ్చే ఎన్నికల్లో టీడీపెలో రాజకీయంగా అగ్రస్థానంలో ఉన్న కొందరు నేతలు..ఈ సారి తమ ఫ్యామిలీకి రెండు సీట్లు దక్కించుకోవాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు..ఒక ఫ్యామిలీకి ఒకటే సీటు అని…కొందరికి హ్యాండ్ ఇచ్చారు. కానీ కింజరాపు, అశోక్ గజపతి, కోట్ల, భూమా లాంటి ఫ్యామిలీలకు రెండు సీట్లు ఇచ్చారు. అయితే ఈ సారి మిగతా ఫ్యామిలీలు సైతం రెండు సీట్లు ఆశిస్తున్నాయి. అయ్యన్నపాత్రుడు, జ్యోతుల, పరిటాల ఫ్యామిలీలు రెండు సీట్లు ఆశిస్తున్నాయి.

అయితే వారికి రెండు సీట్లు ఇస్తారా ? లేదా? అనేది క్లారిటీ లేదు గాని..అయ్యన్న తనతో పాటు తన వారసుడు విజయ్‌కు సీటు అడుగుతున్నారు. టిడిపి ఓడిపోయాక అయ్యన్న, విజయ్ పార్టీ కోసం గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. దీంతో తనకు ఎలాగో నర్సీపట్నం ఉంటుంది..ఇటు విజయ్‌కు అనకాపల్లి ఎంపీ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అటు పరిటాల ఫ్యామిలీ ఎలాగో రెండు సీట్లలో ఇంచార్జ్‌లుగా ఉన్నారు. సునీతమ్మ రాప్తాడు, శ్రీరామ్ ధర్మవరం ఇంచార్జ్ గా ఉన్నారు. ఈ రెండు సీట్లలో పోటీ చేయాలని చూస్తున్నారు.




ఇక జ్యోతుల ఫ్యామిలీ సైతం రెండు సీట్లు ఆశిస్తుంది. ఎలాగో జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ పోటీ చేయడం ఖాయం. అదే సమయంలో తన తనయుడు నవీన్‌కు కాకినాడ ఎంపీ సీటు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. ఎలాగో ప్రస్తుతం కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా నవీన్ పనిచేస్తున్నారు. పైగా ఆ సీటు ఖాళీగా ఉంది.


గత ఎన్నికల్లో చలమలశెట్టి సునీల్ పోటీ చేసి ఓడిపోయారు..తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్లారు. దీంతో ఆ సీటు ఖాళీగా ఉంది. ఇప్పుడు ఆ సీటులో పోటీ చేయాలని నవీన్ చూస్తున్నారు. చూడాలి మరి జ్యోతుల ఫ్యామిలీకి చంద్రబాబు రెండ్ సీట్లు ఇస్తారో లేదో.
