ఏపీలో ఇప్పుడుప్పుడే తెలుగుదేశం పార్టీ గాడిన పడుతుంది. గత ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న నియోజకవర్గాల్లో పార్టీ ఇప్పుడే పికప్ అవుతుంది. పలు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి మెరుగు అవుతుంది. అలాగే గత ఎన్నికల తర్వాత పలు స్థానాల్లో టీడీపీకి సరైన నాయకులు లేకుండా పోయారు…అలాంటి స్థానాల్లో చంద్రబాబు, అభ్యర్ధులని పెట్టుకుంటూ వస్తున్నారు. ఇదే క్రమంలో పార్లమెంట్ స్థానాల్లో కూడా అభ్యర్ధులని పెట్టాల్సిన అవసరం ఉంది.

ఇప్పటికే కొన్ని పార్లమెంట్ స్థానాల్లో అభ్యర్ధులు ఫిక్స్ అయ్యారు. మరి కొన్ని చోట్ల అభ్యర్ధుల్ని ఫిక్స్ చేయాల్సి ఉంది. ఈ క్రమంలోనే కాకినాడ పార్లమెంట్ సీటుని ఎవరికి ఫిక్స్ చేస్తారనే అంశం ఆసక్తిగా మారింది. అటు వైసీపీ నుంచి ఎంపీ వంగా గీత ఉన్నారు. కానీ టీడీపీ నుంచే ఇంచార్జ్ లేరు. గత ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన చలమలశెట్టి సునీల్ ఎలాగో వైసీపీ వైపుకు వెళ్ళిపోయారు. దీంతో కాకినాడ పార్లమెంట్ సీటులో అభ్యర్ధి లేకుండా పోయారు.

కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడుగా జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ బాబు పనిచేస్తున్నారు. పార్లమెంట్ పరిధిలో టీడీపీ బలోపేతానికి నవీన్ బాబు కృషి చేస్తున్నారు. అటు కాకినాడ పరిధిలో ఉన్న జగ్గంపేట అసెంబ్లీ స్థానం బాధ్యతలని జ్యోతుల నెహ్రూ చూసుకుంటున్నారు. ఇక ఎలాగో జగ్గంపేట సీటు జ్యోతుల ఫ్యామిలీ చేతిలో ఉంది కాబట్టి….పార్లమెంట్ సీటు కూడా ఆ ఫ్యామిలీకే కేటాయిస్తారా? లేదా అనేది చూడాలి.

ప్రస్తుతానికి కాకినాడ సీటులో మాత్రం టీడీపీకి నాయకుడు లేరు. అలాంటప్పుడు పార్లమెంట్ అధ్యక్షుడుగా ఉన్న నవీన్ బాబుకే సీటు ఫిక్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఇంకో ఛాన్స్ కూడా ఉంది..ఒకవేళ టీడీపీ-జనసేనలు పొత్తు పెట్టుకుంటే…కాకినాడ ఎంపీ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు కూడా ఉన్నాయి. చూడాలి మరి కాకినాడ ఎంపీ సీటు జ్యోతుల తనయుడుకు దక్కుతుందో లేదో.

Discussion about this post