కడప అంటే వైఎస్సార్ కోట..గతంలో వైఎస్సార్ ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఇప్పుడు జగన్ వల్ల వైసీపీకి కంచుకోటగా ఉంది. ఇక గత నాలుగు ఎన్నికల నుంచి కడపలో టిడిపి దారుణమైన పరాజయాలని మూటగట్టుకుంటుంది. జిల్లాలో సత్తా చాటలేకపోతుంది. ఇలాంటి పరిస్తితుల నుంచి ఇప్పుడు టిడిపి బయటపడుతుంది. అనూహ్యంగా టిడిపి పుంజుకుంటుంది. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్ర టిడిపికి కొత్త ఊపు తీసుకొస్తుంది. అటు ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వైసీపీకే నష్టం చేస్తుంది.
ఈ సారి కడపలో టిడిపి ఊహించని ఫలితాలు దక్కించుకోవడం ఖాయం. ఈ క్రమంలో కడపలో టిడిపి మొదట గెలిచే సీటు ఏదైనా ఉందంటే అది మైదుకూరు అనే చర్చ సాగుతుంది. తాజాగా లోకేష్ పాదయాత్ర మైదుకూరులో సాగిన విషయం తెలిసిందే. అయితే పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. రోడ్ షో సభకు విపరీతంగా రోడ్లు నిండిపోయాయి. దీంతో మైదుకూరులో టిడిపి బలం ఏంటో అర్ధమైపోయింది. అసలు ఇక్కడ టిడిపి గెలిచిందే కేవలం 2 సార్లు మాత్రమే..1985, 1999 ఎన్నికల్లోనే గెలిచింది.

మళ్ళీ ఎప్పుడు గెలవలేదు. అలాంటి స్థానంలో టిడిపి బలపడింది.టిడిపి నేత పుట్టా సుధాకర్ యాదవ్ కు ప్రజా బలం పెరిగింది. మున్సిపల్ ఎన్నికల్లోనే మైదుకూరు మున్సిపాలిటీలో 24 వార్డులు ఉంటే టిడిపి 12 గెలుచుకుంది. వైసీపీ 11, జనసేన ఒకటి గెలుచుకుంది.కానీ ఎక్స్‌అఫిషియో సభ్యులతో మున్సిపాలిటిని వైసీపీ కైవసం చేసుకుంది.
అయితే అప్పుడే వైసీపీ గాలిలోనే టిడిపి సత్తా చాటింది. ఇప్పుడు ఆ ఆధిక్యం మరింత పెరిగింది. లోకేష్ పాదయాత్రతో మరింత ఊపు వచ్చింది. ఎన్నికలు ఎప్పుడు జరిగిన కడపలో టిడిపి ఫస్ట్ గెలిచే సీటు మైదుకూరు అని అంటున్నారు.