కడపలో వైసీపీకి మినహా టీడీపీకి పెద్ద ఆదరణ ఉండదనే సంగతి తెలిసిందే…కడప ప్రజలు వైసీపీ వైపే మొగ్గు చూపుతారు తప్ప, టీడీపీ వైపుకు రావడం చాలా కష్టం. గత రెండు ఎన్నికల్లోనూ కడప ప్రజలు…వైసీపీకే సపోర్ట్ ఇచ్చారు…దీంతో ఆ పార్టీ వరుసపెట్టి భారీ విజయాలని సొంతం చేసుకుంది. అయితే వైసీపీని గెలిపించిన ఉపయోగం లేదని కడప ప్రజలకు నిదానంగా అర్ధమవుతుంది. ఈ రెండున్నర ఏళ్లలో కడప ప్రజలకు ఒరిగింది ఏమి లేదు…సరైన అభివృద్ధి లేదు…పైగా పన్నుల భారం పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు.

దీంతో కడప ప్రజలకు వైసీపీపై అసంతృప్తి పెరుగుతుంది…పైగా గతంలో టీడీపీ అధికారంలో ఉండగా కడపలో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. 2014లో ఒక్క సీటు మాత్రమే గెలిపించినా సరే…చంద్రబాబు కడపపై స్పెషల్‌గా ఫోకస్ పెట్టి పనిచేశారు. ఆ విషయం ఇప్పుడు కడప ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు..నాడు-నేడు మాదిరిగా చంద్రబాబు ఉన్నప్పుడు కడపలో ఎలాంటి పనులు జరిగాయి…ఇప్పుడు జగన్ ఉండగా ఏం జరుగుతుందనే అంశాలు ఆలోచిస్తున్నారు.

అదే సమయంలో కడప టీడీపీ నేతలు సైతం దూకుడుగా పనిచేస్తున్నారు..కడపలో ఉండే ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాడుతున్నారు. రాజకీయంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే ఎదురునిలబడి పోరాడుతున్నారు. తాజాగా కూడా వెరైటీగా జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులపై నిరసన తెలియజేసారు. అడ్డగోలుగా అప్పులు చేయడాన్ని నిరసిస్తూ కడపలో టీడీపీ నేతలు భిక్షాటన చేశారు.

చంద్రబాబు హయాంలో రాష్ట్రం అభివృద్ధి వైపుగా వెళితే.. జగన్ చేతకాని పాలనతో దివాళా దిశగా తీసుకెళుతున్నారని మండిపడ్డారు. బీటెక్ రవి, లింగారెడ్డి, అమీర్‌బాబు, వెంకటసుబ్బారెడ్డి, గోవర్ధన్‌రెడ్డిలతో పాటు పలువురు నేతలు జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు నిరసనగా భిక్షాటన చేశారు. అలాగే ప్రభుత్వ ఆస్తులని ఎలా తాకట్టు పెడుతున్నారో వివరించే ప్రయత్నం చేశారు. ఇలా కడప తమ్ముళ్ళు వెరైటీగా జగన్ ప్రభుత్వాన్ని ఏకీపారేశారు. మొత్తానికి కడప తమ్ముళ్ళు ఎక్కడా తగ్గేలా లేరు.

Discussion about this post