ఈ సారి వైసీపీ కంచుకోటలని టిడిపి బద్దలుగొట్టేలా ఉంది. వైసీపీపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్న నేపథ్యంలో టిడిపి అనూహ్యంగా పుంజుకుంటూ వస్తుంది. ఇక వైసీపీకి ఇంతకాలం అండగా ఉంటున్న కొన్ని స్థానాల్లో సైతం సీన్ మారుతుంది. ఇదే క్రమంలో వైసీపీ కంచుకోటగా ఉన్న కడపలో రాజకీయం మారిపోతుంది. పేరుకు జగన్ సొంత జిల్లా గాని అక్కడ పెద్దగా అభివృద్ధి లేదు..అలాగే ఏదో కొంతమంది నేతలు బాగుపడటం తప్ప..కింది స్థాయి వైసీపీ నేతలకు ఒరిగింది లేదు.
పథకాల పేరిట డబ్బులు ఇచ్చిన…పన్నుల పేరిట ప్రజల వద్ద నుంచి డబుల్ వసూలు చేస్తున్నారు. దీంతో వైసీపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో కడపలో సైతం ఈ సారి వైసీపీకి షాక్ తగిలేలా ఉంది. గత ఎన్నికల్లో జిల్లాలో ఉన్న 10కి 10 సీట్లు వైసీపీ గెలుచుకుంది. కానీ ఈ సారి మాత్రం క్లీన్ స్వీప్ జరగడం కష్టమని తెలుస్తోంది. పలు స్థానాల్లో టిడిపి పుంజుకుంది.

అదే సమయంలో టిడిపి కడపలో 5 సీట్లని టార్గెట్ గా పెట్టుకుంది. ఆ సీట్లలో సత్తా చాటాలని చూస్తుంది. ఎలాగో కడప, బద్వేలు, రాయచోటి, పులివెందుల, జమ్మలమడుగు లాంటి సీట్లలో టిడిపికి పెద్ద పట్టు లేదు. ఆ సీట్లలో టిడిపి గెలుపు అవకాశాలు పెద్దగా లేవు. కానీ మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, కమలాపురం, రైల్వేకోడూరు లాంటి సీట్లలో టిడిపి బలం పెరుగుతుంది.
టిడిపి ఇంకా కాస్త కష్టపడితే ఐదు సీట్లలో గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట సీట్లలో టిడిపికి లీడ్ కనిపిస్తుంది. మిగిలిన రెండు సీట్లలో వైసీపీతో గట్టిగా పోరాడాల్సి ఉంది. ఆ సీట్లలో కూడా టిడిపి బలపడితే..మొత్తం 5 సీట్లు గెలుచుకుని టిడిపి సంచలనం సృష్టించడం ఖాయం.
