కడప జిల్లా అంటే వైసీపీ అడ్డా అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ సొంత జిల్లా అయిన కడపలో వైసీపీకి బలం ఎక్కువ. అందుకే గత ఎన్నికల్లో 10కి 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ టీడీపీకి ఏ మాత్రం స్కోప్ లేదు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కడపలో నిదానంగా వైసీపీ బలం తగ్గుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరగడం వైసీపీకి బాగా మైనస్ అవుతుంది. ఇదే క్రమంలో టీడీపీ నేతలు దూకుడుగా పనిచేస్తూ పార్టీ బలాన్ని పెంచుతున్నారు.

ఇదే క్రమంలో రెండు, మూడు స్థానాల్లో టీడీపీ లీడ్ లోకి వచ్చిందని తెలుస్తోంది. వాస్తవానికి కడపలో వైసీపీదే లీడింగ్. కానీ ఇక్కడ ఒక్క సీటు వైసీపీ ఓడిపోయినా సరే..ఆ పార్టీకి నష్టమే అని చెప్పవచ్చు. అయితే నిదానంగా కడపలో వైసీపీ డ్యామేజ్ పెరుగుతుంది. ఇదే సమయంలో జిల్లాలో ఉన్న సీనియర్ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి..టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా ఆయన జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

పరిపాలన మొదట రోజు నుంచే జగన్ అవినీతికి పాల్పడ్డారని, వైసీపీలో ఉన్నానంటే తనకే అసహ్యంగా ఉందని, ఈ సారి వైసీపీకి సింగిల్ డిజిట్ వస్తే గొప్పే అని అన్నారు. ఏపీని చంద్రబాబు తప్ప మరొకరు కాపాడలేరని, పవన్ నిజాయితీని ప్రశించలేమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బాబు-పవన్ కలిసి పోటీ చేస్తారని ఆశిస్తున్నానని, తాను ఇప్పుడు వైసీపీలోనే ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో గుర్తింపు పొందిన పార్టీ నుంచి మైదుకూరులో పోటీ చేస్తానని అన్నారు. జనవరి 3 నుంచి వివేకా హత్య కేసు మలుపులు తిరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

డీఎల్ మాటలు బట్టి చూస్తే ఆయన టీడీపీలోకి వచ్చేలా ఉన్నారు. అలాగే టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని భావిస్తున్నారు. పొత్తు ఉన్నా సరే మైదుకూరు సీటు టీడీపీకే దక్కుతుంది..అంటే డీఎల్ టీడీపీలోకి వస్తారు. కాకపోతే అక్కడ టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు. మరి ఆయన్ని కాదని డీఎల్‌కు సీటు ఇస్తారా? అనేది చూడాలి.
