March 22, 2023
కడప టీడీపీలో పోటీ..ఆ సీట్లలో గెలుపు ఛాన్స్.!
ap news latest AP Politics Politics TDP latest News

కడప టీడీపీలో పోటీ..ఆ సీట్లలో గెలుపు ఛాన్స్.!

కడప అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మొదట నుంచి కడపలో టీడీపీకి పెద్ద పట్టు లేదనే చెప్పాలి. ఏదో రెండు, మూడు నియోజకవర్గాల్లోనే టి‌డిపికి మంచి పట్టు ఉండేది. కానీ గత రెండు ఎన్నికల నుంచి అది కూడా లేదు. 2014లో జిల్లాలో 10 సీట్లు ఉంటే టి‌డి‌పి 1 సీటు మాత్రమే గెలుచుకోగా, 2019 ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకోలేదు.

అంటే కడపలో వైసీపీ హవా ఏ మాత్రం ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈ సారి ఎన్నికల్లో వైసీపీ హవా నడిచేలా లేదు. ఆధిక్యం వైసీపీకే ఉండవచ్చు గాని..గత ఎన్నికల మాదిరిగా క్లీన్ స్వీప్ చేయడం జరిగే పని కాదు. జిల్లాలో ఈ సారి టి‌డి‌పి బలం పెరుగుతుంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. అయితే టి‌డి‌పికి నిదానంగా పట్టు పెరగడంతో కొన్ని సీట్లలో పొటి నెలకొంది. సీట్లు దక్కించుకునేందుకు నేతలు పొటి పడుతున్నారు.

మొదట టి‌డి‌పి ఆధిక్యంలోకి వచ్చిన మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారు..అయితే టి‌డి‌పిలోకి వచ్చి అక్కడ పొటి చేయాలని డి‌ఎల్ రవీంద్రా రెడ్డి చూస్తున్నారు. ఇటు రాయచోటిలో టి‌డి‌పి సీటు కోసం ముగ్గురు నేతలు పొటి పడుతున్నారు. అలాగే రాజంపేట సీటులో కూడా పొటి ఎక్కువ ఉంది. ఇటు రైల్వేకోడూరు సీటులో ఇదే పరిస్తితి. అలాగే కమలాపురం, ప్రొద్దుటూరు సీట్లలో సైతం పొటి నెలకొంది.

ఇలా జిల్లాలో పలు సీట్లలో టి‌డి‌పిలో పోటీ ఉంది. పైగా కొందరు కీలక నేతలు టి‌డి‌పిలోకి వచ్చి పోటీ చేయాలని చూస్తున్నారు. అయితే జిల్లాలో  రాజంపేట, మైదుకూరు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు సీట్లలో టి‌డి‌పికి గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి.