అనంతపురం జిల్లా వైసీపీలో విభేదాలు తారస్థాయికి చేరుతున్నాయి..ఉమ్మడి జిల్లాలో పలు నియోజకవర్గాల్లో వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా జరుగుతుంది. ఆఖరికి ఈ పోరుని సెట్ చేయడానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి ఎదుటే వైసీపీ నేతలు గొడవ పడుతున్నారు అంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒక నియోజకవర్గంలో రచ్చ ఉంటే పర్లేదు..దాదాపు పెద్దిరెడ్డి సమీక్ష చేసిన అన్నీ స్థానాల్లో అదే పరిస్తితి.

పెద్దిరెడ్డి ఇప్పటివరకు కళ్యాణదుర్గం, ఉరవకొండ, పెనుకొండ, మడకశిర స్థానాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ అన్నీ స్థానాల్లో వైసీపీలో వర్గ పోరు నడిచింది. తాజాగా కదిరి స్థానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ కూడా వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. సమీక్షా సమావేశం జరిగే వేదికపైనే నేతలు కొట్టుకునే వరకు వెళ్లారు. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, వైసీపీ నేత పూల శ్రీనివాసరెడ్డి వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక…వైసీపీ ఎమ్మెల్యేల్లో ప్రజా వ్యతిరేకత త్వరగా పెరిగిన వారిలో కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డి ముందున్నారు.

ఈయనకు మొదట నుంచి పాజిటివ్ కనిపించడం లేదు..దాదాపు నాలుగేళ్ళు అవుతున్న సరే..కదిరిలో అభివృద్ధి శూన్యం. పైగా అక్రమాలు, దందాలు పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశాలు వైసీపీకి మైనస్ అవుతున్నాయి. అయితే అటు టీడీపీ ఇంచార్జ్ కందికుంట వెంకటప్రసాద్..బాగా దూకుడుగా ముందుకెళుతున్నారు. వరుసగా ఓడిపోతున్న సానుభూతి ఆయనపై ఉంది.

2014 ఎన్నికల్లో చాలా స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కందికుట ఓటమి పాలయ్యారు. ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజల్లోనే ఉంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ మూడున్నర ఏళ్లలో దాదాపు తన బలాన్ని పెంచుకున్నారు. సర్వేలు కూడా కందికుంటకు అనుకూలంగా ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే కదిరిలో టీడీపీకి గెలుపు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

Leave feedback about this