కృష్ణా జిల్లా అంటే టీడీపీకి అనుకూలమైన జిల్లా అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ది ఇదే జిల్లా కాబట్టి…ఇక్కడ మొదట నుంచి టీడీపీకి మంచి పట్టు ఉంది. అయితే గత ఎన్నికల్లోనే కాస్త పట్టు తప్పింది…వైసీపీ డామినేట్ చేసింది…కానీ మళ్ళీ తక్కువ సమయంలోనే జిల్లాలో టీడీపీ పికప్ అయింది. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి పాజిటివ్‌గా ఉంది. కానీ ఇంకా కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ పికప్ అవ్వాల్సిన అవసరముంది. నాలుగైదు నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్తితి కాస్త అధ్వాన్నంగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం లోపం వల్ల పార్టీ పికప్ అవ్వలేకపోతుంది. అలా కైకలూరు నియోజకవర్గంలో కూడా పార్టీ పుంజుకోలేకపోతుంది. మామూలుగానే ఇక్కడ టీడీపీకి పెద్దగా బలం లేదు. ముదినేపల్లి నియోజకవర్గంగా ఉన్నప్పుడు కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత కైకలూరుగా ఏర్పాడ్డాక 2009లో ఒకసారి గెలిచింది. అయితే 2014లో పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంతో ఆ పార్టీ తరుపున కామినేని శ్రీనివాస్ విజయం సాధించారు.

2019 ఎన్నికల్లో టీడీపీ డైరక్ట్‌గా పోటీ చేసి ఓటమి పాలైంది. వైసీపీ తరుపున దూలం నాగేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఈ రెండున్నర ఏళ్లలో ఎమ్మెల్యే దూలంకు అంత పాజిటివ్ లేదు. ఆయనపై వ్యతిరేకత పెరుగుతుంది. ఇలాంటి సమయంలో టీడీపీకి మంచి ఛాన్స్ దొరికినట్లే…కానీ ఆ ఛాన్స్‌ని టీడీపీ మాత్రం ఉపయోగించుకోలేకపోతుంది. ఎందుకంటే ఇక్కడ టీడీపీ నేత జయమంగళ వెంకటరమణ అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. దీని వల్ల కైకలూరులో టీడీపీ పుంజుకోలేకపోతుంది.

అదే సమయంలో ఈ సీటు ఎవరికి ఇస్తారనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జయమంగళకు యాంటీగా టీడీపీలో మరో వర్గం పావులు కదుపుతుంది. మాజీ జెడ్పీటీసీ విజయలక్ష్మీ భర్త నాని…కైకలూరు సీటు కోసం ట్రై చేస్తున్నారు. యాదవ సామాజికవర్గానికి చెందిన ఈయనకు కైకలూరులో మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో నెక్స్ట్ గానీ జనసేనతో పొత్తు ఉంటే…ఈ సీటు ఆ పార్టీకే దక్కే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. దీంతో కైకలూరు సీటు విషయంలో టీడీపీకి క్లారిటీ లేకుండా పోయింది.

Discussion about this post