వచ్చే ఎన్నికల్లో పొత్తులో పోటీ చేస్తారో, లేక సింగిల్ గా పోటీ చేస్తారో టీడీపీ నేతలకు ఇంకా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే సింగిల్ గానే పోటీ చేయడానికి టీడీపీ రెడీ అయింది…అందుకు తగ్గట్టుగానే రాజకీయం చేస్తూ ముందుకెళుతున్నారు. పొత్తుల గురించి ఇప్పుడే మాట్లాడకుండా చంద్రబాబు…ముందు పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టి ముందుకెళుతున్నారు. ఇక ఎన్నికల ముందు పరిస్తితులని బట్టి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి.

కాబట్టి పొత్తు అనే మాట పక్కన పెట్టేయాలి…ఇప్పుడు టీడీపీ నాయకులంతా కష్టపడి పనిచేసి…ఎవరి నియోజకవర్గంలో వారు పార్టీని బలోపేతం చేయాలి. అప్పుడే వచ్చే ఎన్నికల్లో టీడీపీ సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించగలదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో పలు నియోజకవర్గాల్లో టీడీపీకి సరైన నాయకులు కనిపించడం లేదు. పైగా కొన్ని స్థానాల్లో ఇంచార్జ్ లు కూడా లేరు. ఇదే క్రమంలో కైకలూరు సీటు విషయంలో కూడా క్లారిటీ రావడం లేదు.వాస్తవానికి నెక్స్ట్ జనసేనతో గాని పొత్తు ఉంటే…ఈ సీటు ఖచ్చితంగా ఆ పార్టీకే కేటాయిస్తారు..ఇందులో ఎలాంటి డౌట్ లేదు. 2014 ఎన్నికల్లో సైతం పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. కాబట్టి నెక్స్ట్ పొత్తు ఉంటే జనసేనకు సీటు దక్కుతుంది. అందుకే ఈ సీటులో ఏ నాయకుడుకు కూడా పూర్తి బాధ్యతలు అప్పగించలేదు. ఉండటానికి మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నారు. కానీ ఈయనకు అధికారికంగా సీటు ఫిక్స్ చేయలేదు. ఎందుకంటే నెక్స్ట్ జనసేనకు సీటు కేటాయిస్తే, ఇబ్బందులు వస్తాయని చెప్పి ఈ సీటుని హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది.

కానీ ఇప్పుడు పొత్తు అంశం తేలేలా లేదు…కాబట్టి కైకలూరులో టీడీపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ బలమైన నాయకుడుకు బాధ్యతలు అప్పగించి, పార్టీని బలోపేతం చేయాలి. అప్పుడే సింగిల్ గా పోటీ చేసిన సరే టీడీపీకి ఇబ్బంది ఉండదు..లేదంటే గత ఎన్నికల మాదిరిగా జనసేన ఓట్లు చీల్చి, వైసీపీ గెలుపుకు ఉపయోగపడుతుంది.
Discussion about this post