ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే రకరకాల ప్రణాళికలు రచిస్తున్నారు. పార్టీలో సీనియర్ నేతలను పక్కనపెట్టి యువకులకు ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలోనూ పార్టీ గెలిచినా… గెలవకపోయినా బలమైన అభ్యర్థులు రంగంలో ఉండాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతల సేవలను కూడా ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇన్చార్జిలు లేకుండా ఖాళీగా ఉన్న నియోజకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బాబు అసెంబ్లీ ఇంచార్జ్ లను భర్తీ చేసుకుంటూ వస్తూనే… అటు ఎంపీ సీట్ల విషయంలో కూడా ఫోకస్ పెడుతున్నారు.

గత ఎన్నికల్లో రాష్ట్రంలో ఉన్న 25 ఎంపీ సీట్లలో టిడిపి శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు సీట్లలో మాత్రమే విజయం సాధించింది. ఎన్నికల తర్వాత టిడిపి నుంచి ఎంపీగా పోటీ చేసిన అభ్యర్థులు అడ్రస్ లేకుండా పోయారు. కొందరు పార్టీ నేతలు ఇప్పటికే పార్టీ మారిపోగా మరికొందరు అవుట్ డేటెడ్ అయిపోయారు. చిత్తూరులో పోటీ చేసిన శివప్రసాద్, రాజంపేటలో పోటీచేసిన సత్యప్రభ మృతి చెందారు.

ఇప్పుడు టిడిపి తరఫున పోటీ చేసేందుకు బలమైన ఎంపీ అభ్యర్థులు అంటూ లేకుండా పోయారు. ఈ క్రమంలోనే పార్టీ సీనియర్ నేతలను ఎంపీలుగా పోటీ చేయించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కీలకమైన లోక్‌సభ సీటు అయిన కాకినాడ నుంచి మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పోటీ చేయడం దాదాపు ఖరారైంది. సామాజిక సమీకరణాల పరంగా కాకినాడ నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేతలు పోటీ చేస్తేనే ఈసారి అక్కడ టిడిపి గెలుస్తుందన్న నిర్ణయానికి పార్టీ నేతలు వచ్చారు.

గత ఎన్నికల్లో కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేసిన చలమలశెట్టి సునీల్ తిరిగి వైసీపీలోకి వెళ్లిపోయారు. దీంతో కాకినాడ ఎంపీగా పోటీ చేసేందుకు టిడిపి నుంచి బలమైన అభ్యర్థులు ఎవరూ లేరు. జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తనయుడు జ్యోతుల నవీన్ పేరు వినిపిస్తున్నా.. నవీన్ యువకుడు కావడంతో ఆయన జగ్గంపేట అసెంబ్లీ బరిలో ఉండనున్నారు. ఇక పెద్దాపురం నుంచి చినరాజప్ప వరుసగా రెండు సార్లు విజయం సాధించారు. గత ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన ఆయన దూకుడుగా వ్యవహరించే లేకపోయారు.

ఆయన జిల్లాలోనే కాపు ఉద్యమం ఉధృతంగా జరిగినా చినరాజప్ప చేతులెత్తేశారు. రాజప్ప పార్టీకి విధేయుడు అయనా దూకుడుగా ఉండరన్న టాక్ ఉంది. అటు ఇతర పార్టీల విమర్శలను కూడా తిప్పికొట్టే సాహసం లేకపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో యువకులు వైసీపీని డీ అంటే డీ కొట్టే నేతలకే ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వాలన్న నిర్ణయానికి బాబు వచ్చారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా కూడా కనీసం బుచ్చయ్య చౌదరి రేంజ్‌లో కూడా వైసీపీ వాళ్లకు కౌంటర్లు ఇవ్వలేకపోతున్నారు. అయితే పార్టీకి విధేయులుగా ఉన్న చినరాజప్పను అసెంబ్లీ నుంచి తప్పించి ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదన ఉన్నట్లు తెలుస్తోంది

తూర్పుగోదావరి జిల్లాలో టిడిపి నాలుగు ఎమ్మెల్యే సీట్లను ఎప్పుడూ కమ్మ సామాజిక వర్గానికి కేటాయిస్తూ వస్తోంది. ఆ తర్వాత ఇది మూడు సీట్లకు పడిపోయింది. గత ఎన్నికల్లో బుచ్చయ్య చౌదరి – పెందుర్తి వెంకటేష్ – వేగుళ్ళ జోగేశ్వరరావు టిడిపి నుంచి పోటీ చేశారు. అయితే వచ్చే ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ లేదా రాజానగరంలో ఒక సీటు కాపు వర్గానికి లేదా బీసీలకు కేటాయించనున్నారు. జనసేనతో పొత్తు ఉన్నా లేదా బుచ్చయ్య వచ్చే ఎన్నికల్లో తప్పుకున్నా అప్పుడు కమ్మ వర్గానికి మండపేట ఒక్కటి మిగిలినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

దీంతో కమ్మ వర్గానికి మంచి పట్టున్న పెద్దాపురం సీటును కమ్మ సామాజిక వర్గానికి కేటాయించనున్నారని తెలుస్తోంది. ఇక్కడ నుంచి గతంలో పార్టీ తరపున కమ్మ వర్గానికే చెందిన బొడ్డు భాస్కర రామారావు రెండుసార్లు గెలిచారు. ఆయన తప్పుకున్నాకే ఇక్కడ చినరాజప్ప పాగా వేశారు. ఇక రాజప్ప ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా కమ్మ వర్గానికి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.

Discussion about this post