వచ్చే ఎన్నికల్లో టిడిపి-జనసేన కలిసి పోటీ చేస్తాయా? ఆ రెండు పార్టీలతో బిజేపి కలుస్తుందా? లేక బిజేపి-జనసేన కలిసి పోటీ చేస్తాయా? టిడిపి ఒంటరిగా పోటీ చేస్తుందా? అంటే ఇప్పుడేమీ పొత్తులపై క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తులపై చేసే స్టేట్‌మెంట్స్ చాలా కన్ఫ్యూజన్ తెస్తున్నాయి. కాసేపు టిడిపితో కలిసి ముందుకెళుతున్నట్లే చెబుతారు..అలాగే బిజేపిని కలుపుకుని వెళ్తామని అంటారు. మళ్లీ తర్వాత బిజేపితో పొత్తు ఉందని, ఎన్నికల్లో బిజేపితో కలిసే పోటీ చేస్తామని అంటున్నారు.

చెప్పాలంటే పొత్తుల విషయంలో బిజేపి ఇంకా క్లారిటీ గా ఉంది. జనసేనతో పొత్తు ఉందని చెబుతూనే..టీడీపీతో కలవమని గట్టిగా చెప్పేస్తుంది. ఒకవేళ జనసేన వదిలేసిన సరే అభ్యంతరం లేదన్నట్లే ఉన్నారు. కానీ పవన్‌కు ఇప్పుడు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎందుకంటే టీడీపీతో కలిస్తేనే అధికారంలోకి రాగలరు. అటు టీడీపీకైనా జనసేనతో కలిస్తే అడ్వాంటేజ్ ఉంది. ఆ విషయం పక్కన పెడితే..బిజేపితో కలిసి ముందుకెళ్లడం వల్ల అధికారం అనేది పవన్‌కు సాధ్యమయ్యే పని కాదు.

ఖచ్చితంగా టిడిపితో కలవాల్సిన పరిస్తితి ఉంది. కానీ బిజేపి ఏమో టిడిపితో నో అంటుంది. అలాంటప్పుడు బిజేపిని ఒప్పించి టిడిపితో కలవాలి. అది కుదరని పక్షంలో టీడీపీని పక్కన పెట్టాలి. లేదా బిజేపిని పక్కన పెట్టి టిడిపితో కలవాలి. ఇలా టోటల్ గా పొత్తులపై క్లారిటీ లేకుండా ఉంది. అయితే ఏం చేయాలన్న పవన్ చేతుల్లోనే ఉంది.

టిడిపికి బిజేపితో పొత్తు అవసరం లేనట్లే ఉంది..ఎందుకంటే ఆ పార్టీకి ఒక్క శాతం ఓట్లు లేవు. కానీ జనసేనతో అవసరం కనిపిస్తుంది..ఆ పార్టీ ఓట్లు చీలిస్తే టీడీపీకే నష్టం. ఆ నష్టం జరగకుండా ఉండాలంటే జనసేనతో కలవాలి. కానీ ఇప్పుడు పొత్తులకు సంబంధించిన బంతి పవన్ కోర్టులో ఉంది. ఆయన నిర్ణయం బట్టే పొత్తులు ఉంటాయి.
