May 31, 2023
Uncategorized

కమ్మ నేతల రివెంజ్..ఈ సారి వైసీపీకి చెక్.!

గత ఎన్నికల్లో ఓటమి పాలైన కమ్మ నేతలు..ఈ సారి ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకోవాలనే కసితో పనిచేస్తున్నారు. జగన్ వేవ్ లో చాలామంది టి‌డి‌పి కమ్మ నేతలు ఓటమి పాలయ్యారు. బడా బడా నేతలు, ఓటమి ఎరగని వారు సైతం ఓడిపోయారు. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక వారిని టార్గెట్ చేసుకుని వైసీపీ ఎలాంటి రాజకీయం చేస్తూ వచ్చింది..ఎలా కక్ష సాధించిందో చెప్పాల్సిన పని లేదు.

అయినా సరే కమ్మ నేతలు పోరాడుతున్నారు..అసలు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. వైసీపీని ఓడించాలని కసితో పనిచేస్తున్న చాలామంది కమ్మ నేతలు గెలుపుకు దగ్గరయ్యారు. తాజా సర్వేల్లో గెలుపుకు చేరువయ్యారని తేలింది. అలా గెలుపుకు చేరువైన వారిలో చింతమనేని ప్రభాకర్ ముందు వరుసలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఈయన దెందులూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి గెలవడం ఖాయమని తేలింది. అటు తణుకు నుంచి అరిమిల్లి రాధాకృష్ణ ఈ సారి గెలుపు ఫిక్స్ చేసుకున్నారనే చెప్పాలి.

ఇక ఉంగుటూరులో గన్నీ వీరాంజనేయులు గెలుపు ముంగిట నిలిచారు. ఇటు మైలవరంలో దేవినేని ఉమా సైతం గెలుపు గుర్రం ఎక్కుతారని తేలింది. వరుసగా నాలుగుసార్లు విజయం సాధించిన ఉమా..గత ఎన్నికల్లోనే తొలిసారి ఓడిపోయారు. అటు వరుసగా పొన్నూరులో అయిదుసార్లు గెలిచిన ధూళిపాళ్ళ నరేంద్ర..గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి ఆయనకు తిరుగులేదని తేలింది. పెనమలూరులో బోడే ప్రసాద్ విజయం ఖాయం చేసుకున్నారు.

చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు, మంగళగిరిలో నారా లోకేశ్, వినుకొండలో జీవీ ఆంజనేయులు గెలుపు పక్కా అని చెప్పవచ్చు. ఒంగోలులో దామచర్ల జనార్ధన్ సైతం గెలుపు బాటలో ఉన్నారు. ఇంకా కొందరు కమ్మ నేతలు కష్టపడితే..గెలుపు సులువే.