తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలో ఉన్న క్యాబినెట్ లో కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురు మంత్రులు ఉంటూ వస్తున్నారు. గతంలో ఎన్టీఆర్… ఆ తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కమ్మ వర్గానికి చెందిన మంత్రులకు ప్రాధాన్యం ఉండేది. ఆ మాటకు వస్తే రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెడ్లకు మరి పెద్ద పీట వేసేవారు. చంద్రబాబు ఎన్టీఆర్ ఆ స్థాయిలో కాకపోయినా పార్టీకోసం కష్టపడే కమ్మలకు సమతూకంలో మంత్రి పదవులు ఇచ్చేవారు. కృష్ణ, గుంటూరు జిల్లాల నుంచి ఒక్కొక్క కమ్మ మంత్రి, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వరరావు, నిజామాబాద్ జిల్లా నుంచి మండవ వెంకటేశ్వరరావు కమ్మ కోటాలో మంత్రులుగా ఉండేవారు.

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కృష్ణా జిల్లా నుంచి దేవినేని ఉమామహేశ్వరరావు – గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు – అనంతపురం జిల్లా నుంచి పరిటాల సునీత మంత్రులుగా ఉన్నారు. ఇక చివరి రెండేళ్లు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సైతం మంత్రి అయ్యారు. ఇక సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల సమయం ఉంది. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై అప్పుడే ఊహించని వ్యతిరేకత వచ్చేసింది. మరోవైపు తెలుగుదేశం పార్టీ నేతల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పార్టీ గెలిచేస్తుందన్న ధీమా కూడా కనిపిస్తోంది. ఎవరికి వారు ఈ రెండేళ్లు కష్టపడితే తర్వాత పార్టీలో మంచి పదవులు వస్తాయని ఆశలతో ఉన్నారు.

ఈసారి బాబు క్యాబినెట్లో సామాజిక వర్గాల నుంచి మంత్రులుగా ఎవరెవరు ఉంటారు ? అన్నదానిపై ఎవరి లెక్కల్లో వారు మునిగి తేలుతున్నారు. కాపు వర్గం నుంచి నిమ్మల రామానాయుడు – బొండా ఉమా లాంటి నేతలకు కచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం నుంచి నలుగురు నేతలకు కచ్చితంగా మంత్రి పదవులు ఉంటాయని పార్టీ నేతల మధ్య చర్చ నడుస్తోంది. యువనేత నారా లోకేష్ కు ఎలాగూ మంత్రి పదవి ఉంటుంది… లోకేష్‌ను పక్కన పెడితే ఈసారి కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కు కచ్చితంగా క్యాబినెట్ బెర్త్ ఉంటుందని అంటున్నారు.

గొట్టిపాటి పక్కా మంత్రి.. తిరుగేలేదు…
వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవి అధికార పార్టీ నుంచి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా… తన వ్యాపారాలపై ఎంత దెబ్బ కొడుతున్నా అంతకు మించి పోరాటం చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అద్దంకి నియోజకవర్గం మాత్రమే కాకుండా ప్రకాశం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌తో కలిసి పర్యటిస్తూ జిల్లా అంతటా పార్టీ వర్గాల్లో నింపుతున్నారు. జిల్లాలో అందరి నేతలతో ఆయనకు మంచి సమన్వయం ఉంది. పార్టీలో ఎవరికి అయినా తన వంతుగా సహాయ సహాకారాలు అందిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోను అద్దంకిలో రవి గెలుపు విషయంలో ఎలాంటి డోకా లేదు.ఈ క్రమంలో బాబు క్యాబినెట్లో లోకేష్ తర్వాత బెర్త్ గొట్టిపాటి రవికి రాసి పెట్టుకోవచ్చని రాష్ట్ర స్థాయిలో పార్టీ నేతల్లో టాక్ వచ్చేసింది.

గుంటూరులో జీవి బెర్త్ డిసైడ్..?
ఈసారి గుంటూరు జిల్లా నుంచి నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుకు కూడా మంత్రి పదవి రానుంది. ఇప్పటికీ జిల్లా నుంచి కమ్మ కోటాలో మాకినేని పెదరత్తయ్య – ఆలపాటి రాజా – ప్రత్తిపాటి పుల్లారావు మంత్రులుగా ఉన్నారు. జీవీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం నరసరావుపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆర్థికంగా కూడా ఆయన విపరీతంగా ఖర్చు పెడుతూ పార్టీని నడిపిస్తున్నారు. జిల్లాలో పార్టీకి సుదీర్ఘకాలంగా ఆయన చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు ఈసారి మంత్రి పదవి ఇవ్వటం లాంఛనప్రాయం కానుంది.

కృష్ణాలో గద్దె వర్సెస్ దేవినేని..
ఇక కృష్ణా జిల్లా నుంచి కమ్మ వర్గం లో ఎవరు మంత్రులు అవుతారని దానిపై కాస్త సస్పెన్స్ ఉంది. మొన్న ప్రభుత్వంలో దేవినేని ఉమా మంత్రిగా ఉన్నారు. గత ఎన్నికల్లో అందరూ ఓడిపోయినా కమ్మ వర్గం నుంచి గద్దె రామ్మోహన్ విజయం సాధించారు. గెలిచిన మరో ఎమ్మెల్యే వంశీ పార్టీకి దూరం అయ్యారు. గద్దే మాత్రం పార్టీలో ఉండి పోరాడుతున్నారు. గద్దే సీనియార్టీ నేపథ్యంలో బాబు ఈసారి ఆయన వైపు మొగ్గు చూపుతారా ? లేదా ఉమాకి మళ్ళీ పదవి ఇస్తారా అన్నది కాస్త సస్పెన్స్.


అనంత హీరో కేశవుడే…
ఈసారి అనంతపురం జిల్లా నుంచి కమ్మ వర్గంలో మంత్రి పదవి ఇస్తే కచ్చితంగా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌కు దక్కనుంది. కేశవ్ మంత్రి పదవి కోసం 20 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఉరవకొండలో ఆయన ఓడిపోవడంతో పరిటాల సునీతకు మంత్రి పదవి దక్కింది. ఈసారి పరిటాల మంత్రి పదవి ఉండదు. ఇక పైన చెప్పుకున్న నేతలకు మంత్రి పదవి విషయంలో ఎలాంటి డోకా లేకపోయినా.. వచ్చే ఎన్నికల్లో వారు తమ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. లేకపోతే ఈక్వేషన్లు మారిపోతాయి.

Discussion about this post