ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కనిగిరి నియోజకవర్గం ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఇక్కడ ఎప్పుడు ఒకే పార్టీని ఆదరించడం జరిగే పని కాదు. గత కొన్ని ఎన్నికల నుంచి ఇక్కడ ప్రజలు వేరు వేరు పార్టీలని ఆదరిస్తూ వచ్చారు. 1983, 1985 ఎన్నికల్లో టిడిపి గెలవగా, 1989లో కాంగ్రెస్, 1994లో టిడిపి, 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ గెలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో టిడిపి గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది.

అయితే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి చెక్ పెట్టి సత్తా చాటాలని టిడిపి చూస్తుంది. ప్రస్తుతం నియోజకవర్గం పరిస్తితిని చూస్తే..ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ పై ప్రజా వ్యతిరేకత ఎక్కువ కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే సొంత పార్టీ వాళ్ళే ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇటీవలే ఆయనకు వ్యతిరేకంగా సమావేశం పెట్టి..నెక్స్ట్ ఎన్నికల్లో గాని మళ్ళీ వైసీపీ టికెట్ బుర్రాకు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు చెబుతున్నారు. అంటే అక్కడ వైసీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక టిడిపి నుంచి మాజీ మంత్రి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు. ఆయన గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

ఇక 2019 ఎన్నికల ముందు ఈయన టిడిపిలోకి వచ్చారు. కనిగిరి నుంచి పొటి చేసి దాదాపు 40 వేల ఓట్ల మెజారిటితో ఓడిపోయారు. భారీ మెజారిటితో ఓడిపోయినా సరే ఆయన త్వరగా పికప్ అయ్యారు. పైగా వైసీపీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత కలిసొస్తుంది. ఇదే పరిస్తితి ఎన్నికల వరకు కొనసాగితే మ