శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం అంటే ఒక్కప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. కానీ 2009 ఎన్నికల నుంచి ఇక్కడ టీడీపీ అనుకూల పరిస్తితులు లేవు. 2009 ముందు వరకు ఇక్కడ టీడీపీ అయిదుసార్లు గెలిచింది. అందులో నాలుగుసార్లు కలమట మోహన్ రావు నాలుగుసార్లు గెలిచారు. ఇక ఆయన తనయుడు కలమట వెంకటరమణమూర్తి 2009 ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు.

అయితే 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి వచ్చిన శతృచర్ల విజయరామరాజుకు చంద్రబాబు సీటు ఇచ్చారు. దీంతో కలమట వైసీపీలోకి వెళ్ళి పాతపట్నంలో విజయం సాధించారు. కానీ తర్వాత టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్ళీ తిరిగి తన సొంత పార్టీలోకి వచ్చేశారు. ఇక ఇదే క్రమంలో 2019 ఎన్నికల్లో కలమట టీడీపీ నుంచి పోటీ చేసి రెడ్డి శాంతి చేతిలో ఓడిపోయారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రెడ్డి శాంతి అనుకున్న మేర పనులు చేయడంలో విఫలమైనట్లే కనిపిస్తున్నారు.

ఈ రెండున్నర ఏళ్లలో రెడ్డి శాంతి…పాతపట్నం ప్రజలకు పెద్దగా చేసింది ఏమి లేదు. అందుకే ఇటీవల పలు సర్వేల్లో ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేల లిస్ట్‌లో రెడ్డి శాంతి కూడా ఉన్నారు. అయితే ఆ వ్యతిరేకత ఎలా ఉంటుందో…తాజాగా పాతపట్నం పరిధిలోని హీరా మండలం జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో స్పష్టమైంది.

స్వయంగా రెడ్డి శాంతి..తన తనయుడు శ్రావణ్‌ని వైసీపీ నుంచి జెడ్పీ బరిలో నిలబెట్టారు. అయితే టీడీపీ బడా నాయకులని నిలబెట్టలేదు. మండల పరిధిలో ఒక సామాన్య టీడీపే కార్యకర్త పొగిరి బుచ్చిబాబుని నిలబెట్టారు. ఇక ఇక్కడ టీడీపీ గెలుపు కష్టమని అంతా అనుకున్నారు. అటు ఎమ్మెల్యే కొడుకు, పైగా అధికారంలో ఉన్నారు…అధికార బలంతో వైసీపీ గెలుపు సులువు అని అనుకున్నారు.

కానీ ప్రజల తలుచుకుంటే ఎవరి తలరాతైన మార్చేస్తారని అర్ధమైంది. ఊహించని విధంగా శ్రావణ్‌పై బుచ్చిబాబు 59 ఓట్ల మెజారిటీతో గెలిచారు. అయితే అధికార బలంతో ఎన్నికల కౌంటింగ్‌లో మార్పులు చేయడానికి చూశారుగానీ, పెద్దగా వర్కౌట్ కాలేదు. చివరికి టీడీపీ గెలిచినట్లు అధికారులు ప్రకటించేశారు. టీడీపీ గెలుపు కోసం కలమట గట్టిగానే కష్టపడ్డారు. ఇక ఇదే ఊపు కొనసాగిస్తూ…వచ్చే ఎన్నికల్లో పాతపట్నంలో టీడీపీ జెండా ఎగరవేస్తారని అర్ధమవుతుంది.

Discussion about this post