తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో ఉండి నియోజకవర్గం కూడా ఒకటి..ఈ నియోజకవర్గంలో టీడీపీకి ఓటమి అనేది ఎక్కువసార్లు ఎదురు కాలేదు. 1983 నుంచి 2019 వరకు చూసుకుంటే కేవలం ఒక్కసారి మాత్రమే ఉండిలో టీడీపీ ఓడిపోయింది…అది కూడా వైఎస్సార్ వేవ్ లో 2004 ఎన్నికల్లో ఓడింది…అంతే ఇంకా మళ్ళీ అక్కడ టీడీపీకి ఎదురు కాలేదు. ఆఖరికి జగన్ వేవ్ ఉన్న 2019 ఎన్నికల్లో కూడా ఉండిలో టీడీపీ జెండా ఎగిరింది.

అంటే ఉండి నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ కంచుకోటని బద్దలుగొట్టాలని వైసీపీ చూస్తుంది…ఎలాగో అధికారంలో ఉన్నారు కాబట్టి..ఉండి లో బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు..పైగా టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు బలం కాస్త తగ్గుతూ వస్తుంది. అలాగే పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉండి వైసీపీ వశమవుతుందనే ప్రచారం మొదలైంది.

అయితే ఇక్కడే ఉండి రాజకీయం ఊహించని మలుపులు తిరుగుతుంది…వైసీపీలో నేతల మధ్య ఉన్న అంతర్గత పోరు టీడీపీకి బాగా కలిసొచ్చేలా ఉంది. అసలు ఎన్ని సార్లు నియోజకవర్గ ఇంచార్జ్ లని మార్చిన ప్రయోజనం ఉండటం లేదు. గతంలో ఇక్కడ పాతపాటి సర్రాజు ఇంచార్జ్ గా ఉండేవారు…2014లో ఈయన ఓడిపోయారు..దీంతో పీవీఎల్ నరసింహరాజుని ఇంచార్జ్ గా పెట్టి..2019 ఎన్నికల బరిలో దింపారు. ఇక నరసింహరాజు కూడా ఓడిపోయారు.


దీంతో మళ్ళీ నరసింహరాజుని పక్కన పెట్టి…గోకరాజు రామరాజుని ఇంచార్జ్ గా పెట్టారు. నియోజకవర్గంలో గోకరాజు ఫ్యామిలీకి కాస్త పట్టు ఉంది…పైగా ఆకివీడు నగర పంచాయితీని వైసీపీ కైవసం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఇదే సమయంలో గోకరాజుని సైడ్ చేసి….మళ్ళీ నరసింహరాజుని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో ఉండిలో వైసీపీ వర్గాలు ఫుల్ కన్ఫ్యూజ్ అవుతున్నాయి..


పైగా పార్టీలో పనిచేసిన వారికి కాకుండా…తనకు కావల్సిన వారినే నరసింహరాజు అందలం ఎక్కిస్తున్నారని తెలుస్తోంది. అటు గోకరాజు సెపరేట్ వర్గాన్ని నడుపుతున్నారు. ఇక పాత ఇంచార్జ్ సర్రాజుకు సైతం సెపరేట్ గ్రూపు ఉంది. ఇలా వైసీపీలో గ్రూపుల రాజకీయం నడుస్తోంది…ఈ గ్రూపు రాజకీయమే మళ్ళీ ఉండిలో టీడీపీ జెండా ఎగరడానికి కారణమయ్యేలా ఉంది.

Discussion about this post