కడప జిల్లా అంటేనే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు…కడపలో ప్రతి నియోజకవర్గం వైసీపీ అడ్డాగా ఉన్న విషయం తెలిసిందే. అసలు కడపలో వైసీపీ మినహా మరొక పార్టీని ఆదరించడం చాలా కష్టమని చెప్పొచ్చు. గతంలో కడపలో కాంగ్రెస్‌ని ఆదరిస్తే ఇప్పుడు వైసీపీని అదరిస్తున్నారు. జిల్లాలో టీడీపీకి ఆదరణ పెద్దగా లేదు. ఏదో అప్పుడప్పుడు ఒకటి, రెండు నియోజకవర్గాల్లో గెలవడం తప్ప, పెద్దగా కడపలో టీడీపీ సత్తా చాటిన సందర్భాలు లేవు.

అయితే ఇకపై కడపలో టీడీపీకి సత్తా చాటే అవకాశాలు దొరికేలా ఉన్నాయి…జిల్లాల విభజన అంశం రాజకీయంగా టీడీపీకి కలిసొచ్చేలా ఉంది. ఇటీవల జిల్లాల విభజన చేసిన విషయం తెలిసిందే. కడప పార్లమెంట్‌ని పాత కడప జిల్లాగా ఉంచేసి…రాజంపేట పార్లమెంట్‌ని సెపరేట్‌గా జిల్లా చేశారు. దీనికి అన్నమయ్య జిల్లా అని పేరు పెట్టి, రాయచోటిని జిల్లా కేంద్రంగా పెట్టారు. ఇక ఇదే అంశం ఇప్పుడు వైసీపీకి రాజకీయంగా ఇబ్బందిగా మారింది.

అసలు రాయచోటిని కేంద్రంగా పెట్టడాన్ని రాజంపేట, రైల్వేకోడూరు ప్రజలు అంగీకరించడం లేదు..అన్నమయ్య పుట్టిన గడ్డ రాజంపేటని వదిలేసి…రాయచోటిని కేంద్రంగా ఎలా చేస్తారని చెప్పి రాజంపేట, కోడూరు ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. సొంత వైసీపీ నేతలు సైతం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎట్టి పరిస్తితుల్లోనూ రాయచోటిని ఒప్పుకోవడం లేదు..తక్షణమే రాజంపేటని కేంద్రంగా పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.

అటు మదనపల్లె నియోజకవర్గ ప్రజలు సైతం ఈ నిర్ణయంపై అసంతృప్తిగా ఉన్నారు..అసలు వారిని సెపరేట్ జిల్లాగా చేసేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలా జిల్లాల విభజన అంశం రాజంపేట వైసీపీలో చిచ్చు పెట్టింది. ఇదే కాదు…కొందరు వైసీపీ ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కడప ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ పరిస్తితుల నేపథ్యంలో కంచుకోట కడపలో వైసీపీ సీన్ రివర్స్ అవుతుంది..మొత్తానికి కడపలో ఈ సారి వైసీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగేలా ఉంది.

Discussion about this post