తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో కంచుకోటల్లాంటి నియోజకవర్గాలు ఉన్నాయి…ఎన్ని ఎదురుగాలులు వీచినా సరే ఆ కంచుకోటల్లో టీడీపీ గెలుపు అడ్డుకోవడం కాస్త కష్టమే. గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఫుల్ గా ఉన్నా సరే కొన్ని కంచుకోటల్లో టిడిపి సత్తా చాటింది. అలా టిడిపి సత్తా చాటిన నియోజకవర్గాల్లో రేపల్లె కూడా ఒకటి. మొదట నుంచి ఈ నియోజకవర్గంలో టిడిపి హవా కొనసాగుతూ వస్తుంది. మెజారిటీ సార్లు ఇక్కడ టిడిపి జెండా ఎగిరింది.

ఇక 2014, 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తిరుగులేకుండా పోయింది. రెండుసార్లు టిడిపి తరుపున అనగాని సత్యప్రసాద్ విజయం సాధించారు. అయితే 2014లో టిడిపి అధికారంలో ఉండటంతో అనగానికి ఎలాంటి ఇబ్బంది లేదు. పైగా మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశారు. అందుకే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో కూడా అనగాని రెండోసారి ఎమ్మెల్యేగా గెలవగలిగారు. కానీ ఈ సారి టిడిపి అధికారం కోల్పోయింది…వైసీపీ అధికారంలోకి వచ్చింది.

దీంతో అనగానికి పెద్దగా పని చేయడం కష్టమైపోయింది…నిధులు కూడా అందే పరిస్తితి లేదు. సరే ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్నాక నిధులు అందడం కష్టమే…కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలపై పోరాటం చేయాల్సిన బాధ్యత అనగానికి ఉంటుంది…కానీ అనగాని ఆ కార్యక్రమం ఏమి చేయడం లేదు. ఈయన ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా తక్కువ అని తెలుస్తోంది. ఎక్కువశాతం హైదరాబాద్‌కే పరిమితమైపోతున్నారు.

దీని వల్ల నియోజకవర్గంలో క్యాడర్ కూడా వీక్ అయ్యే పరిస్తితి వచ్చింది. పైగా పంచాయితీ, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో సైతం చిత్తుగా ఓడిపోయారు. రేపల్లె మున్సిపాలిటీ కూడా వైసీపీ ఖాతాలో పడింది. అయినా సరే అనగాని అలెర్ట్ అయ్యి, రేపల్లెలో పార్టీని మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేయడం లేదు. దీంతో కంచుకోటలో టిడిపి చాలా వరకు వీక్ అయిపోయింది…ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ఫస్ట్ టైమ్ వైసీపీ జెండా ఎగరడం ఖాయమనే చెప్పొచ్చు.

Discussion about this post