రాజకీయాల్లో ఎన్నాళ్లు ఉన్నాం అని కాదు.. ప్రజలకు ఏం చేశాం అనేదే కీలకం. అదే సమయంలో అధికారంలో ఉన్నామా లేదా? అని కాదు.. నమ్ముకున్న కార్యకర్తలకు ఎంత మేరకు న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. ఇలా ఆలోచించే నాయకులు చాలా చాలా తక్కువమందే ఉన్నారు. ఇలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నారు… అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా.. మాజీ ఎమ్మెల్యేగా ఉన్నా.. నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు.

అంతేకాదు.. ఏ కార్యకర్త ఇంట్లో శుభకార్యం జరిగినా.. నేనున్నానంటూ.. ఆయన ముందుకు వస్తారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా వాళ్లకు కందికుంట స్పెషల్ సాయం వెళ్లిపోవాల్సిందే. కందికుంట చేతుల మీదుగా వందల సంఖ్యలో వివాహాలు చేసుకున్న జంటలు ఉన్నాయి. అదే సమయంలో ఆసుపత్రుల సమస్యలు వచ్చినా.. అనారోగ్య సమస్యలు వచ్చినా.. కందికుంట ముందుంటారు. కార్యకర్తలకు, నియోజకవర్గం ప్రజలకు.. ఎలాంటి సమస్య వచ్చినా.. ఆయన పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తుంటారు.

వాస్తవానికి ప్రస్తుతం గెలిచిన నాయకులే ప్రజలకు కనిపించ కుండా తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, 2009లో ఒకే ఒక్క సారి విజయం దక్కించుకున్న కందికుంట.. తనను గెలిపించిన ప్రజల పట్ల.. తన విజయానికి కారణమైన పార్టీ కార్యకర్తల పట్ల ఎంతో అభిమానం చూపుతారు. 2004లో తొలిసారి ఇండిపెండెంటుగా పోటీ చేసిన కందికుంట వెంకట ప్రసాద్.. ఆ ఎన్నికల్లో 8 వేల ఓట్లతేడాతో ఓడిపోయారు. తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఓడిపోయినా.. ఇక్కడ ఆయన టీడీపీ తరఫున పోటీ చేసి విజయం దక్కించుకున్నారు.

ఇ క్కడ చిత్రం ఏంటంటే.. ప్రజారాజ్యం, కాంగ్రెస్ వంటి త్రిముఖ పోరు వచ్చినా.. ఏకంగా 15 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకున్నారు. ఇక, 2014 ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. అయితే.. కేవలం 713 ఓట్ల తేడాతోనే ఆయన పరాజయం పాలయ్యారు. గత ఎన్నికల్లో జగన్ సునామీ కారణంగా మరోసారి గెలవలేక పోయారు. అయినప్పటికీ.. తాను గెలిచానా.. ఓడానా.. అనే తేడా లేకుండా.. కందికుంట ప్రజలకు, పార్టీ నాయకులకు అండగా ఉంటున్నా రు. వారి కష్ట సుఖాల్లో ఆయన పాలుపంచుకుంటున్నారు.

అనంతపురం జిల్లా మొత్తం మీద కార్యకర్తకు కష్టం వస్తే ముందుండే వ్యక్తి ఒక్క కందికుంట మాత్రమే అందులో డౌట్ లేదు. తాజాగా.. తనకల్లు మండలంలోని బాలసముద్రం సొసైటీ మాజీ అధ్యక్షుడు బాలకృష్ణ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకు లు.. కందికుంట హుటాహుటిన స్పందించారు. బాలకృష్ణ ఇంటికి వెళ్లి మరీ.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అంతేకాదు.. కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఏ కష్టం వచ్చినా..తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అదేసమయంలో బాలకృష్ణ అంతిమయాత్రలో పాల్గొని పాడె మోయడంతో పాటు ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. పార్టీ కోసం కార్యకర్తలు ఎంతో చేస్తారని… వాళ్ల కోసం తాను చేయకపోతే దానికి అర్థమే ఉండదని కందికుంట చెపుతారు.

Discussion about this post