నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో ఊహించని విషాద ఘటన జరిగింది..ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా కందుకూరులో చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు ప్రాణాలు విడిచారు. భారీగా పార్టీ శ్రేణులు, ప్రజలు తరలిరావడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఇప్పటికే ఇదేం ఖర్మ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఏలూరు, బాపట్ల, విజయనగరం జిల్లాల్లో పర్యటించారు.

బాబు పర్యటనలకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది..ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా పర్యటనకు బాబు వచ్చారు. మొదటిరోజు కందుకూరులో ర్డో షో పెట్టుకున్నారు. ఇక రోడ్ షోకు భారీ స్థాయిలో టీడీపీ శ్రేణులు, ప్రజలు వచ్చారు. కందుకూరు సెంటర్ జనంతో నిండిపోయింది. అప్పటికి బాబు సెంటర్‌లో ప్రసంగం చేసే ముందు తోసుకుంటున్న కార్యకర్తలని వారించారు..వాహనాలు, ఫ్లెక్సీ కర్రలు ఎక్కిన కార్యకర్తలని దిగాలని చెప్పి పదే పదే సూచించారు. ఇదే క్రమంలో మరోవైపు తోపులాట జరగడం..బైకులు కింద పడిపోవడం..అక్కడ ఒకరి మీద ఒకరు పడటం..పక్కనే ఉన్న మురుగు కాల్వలో పడిపోవడంతో 8 మంది కార్యకర్తలు మరణించారు.

అయితే బాబు స్పీచ్ ఆపేసి..కార్యకర్తలని చూసుకోవాలని నేతలకు సూచించారు. పక్కనే ఉన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆ వెంటనే బాబు కూడా వెళ్లారు. కానీ అప్పటికే కొందరు చనిపోయారు. దీంతో బాబు కన్నీటితో మళ్ళీ సెంటర్‌కు వచ్చి చనిపోయిన వారికి శాంతపమ్ ప్రకటించి..ఒక్కొకరికి 10 లక్షల చొప్పున ఆర్ధిక సాయం ప్రకటించారు. అలాగే సభని నిలిపివేశారు.

చనిపోయిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని, గాయపడ్డవారిని ఆదుకుంటామని బాబు హామీ ఇచ్చారు. అలాగే పార్టీ నేతలు సైతం ఎవరికి వారు తమకు తోచిన విధంగా సాయం ప్రకటిస్తున్నారు. ఇతర పార్టీ నేతలు సంతాపం తెలుపుతున్నారు. ప్రధాన మంత్రి కార్యలయం సైతం సంతాపం తెలిపి..ఆర్ధిక సాయం ప్రకటించింది. ఇలా అంతా సంతాపం తెలిపి..చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటామని అంటున్నారు.

కానీ దీనిపై వైసీపీ..టీడీపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. పబ్లిసిటీ పిచ్చితోనే జనాలని పోగేశారని అందుకే తొక్కిసలాట జరిగి చనిపోయారని అంటున్నారు. వైసీపీకి టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నాయి. తమ కార్యకర్తలు చనిపోతే బాబు అన్నీ దగ్గర ఉండి చూసుకుంటున్నారని, ఆర్ధిక సాయం, కుటుంబాలకు అండగా ఉన్నారని, కానీ వైసీపీలో ఎవరైనా చనిపోతే జగన్ అండగా ఉంటున్నారా? అని ప్రశ్నిస్తున్నారు.
