March 24, 2023
చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణ
ap news latest AP Politics TDP latest News

చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కన్నా లక్ష్మినారాయణ

మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం మధ్యాహ్నం టీడీపీ (TDP)లో చేరారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) కండువా కప్పి కన్నాను పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శ్రేణులు కన్నాకు అపూర్వ స్వాగతం పలికారు. అలాగే గుంటూరు మాజీ మేయర్, కన్నా కుమారుడు నాగరాజు (Nagaraju), తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ (Venkatesh Yadav), మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ (SM Nizamuddin) తదితరులు టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కన్నా అనుచరులు, పలువురు సీనియర్ నాయకులు వేలాది మంది ద్వితీయ శ్రేణి నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

అంతకుముందు కన్నా లక్ష్మినారాయణ గుంటూరులోని తన నివాసం నుంచి 3 వేల మంది కార్యకర్తలు, అభిమానులతో భారీ ర్యాలీగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తరలి వచ్చారు. కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా… ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.

నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు.

Leave feedback about this

  • Quality
  • Price
  • Service

PROS

+
Add Field

CONS

+
Add Field
Choose Image
Choose Video