175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన సవాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు…


175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు , ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన సవాల్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడమా జగన్ రెడ్డి ధైర్యమని అడిగారు. టీడీపీ ఏదైనా కార్యక్రమం చేస్తే రాత్రికి వాళ్ల ఆస్తులు తగలబెట్టడమా ధైర్యం అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలని సవాల్ విసిరారు. ‘‘నీ నవరత్నాలపై నీకు నమ్మకం ఉంటే సక్రమ పద్దతిలో ఎన్నికలకు రా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకో. కులం, మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు, సవాళ్లు’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
