మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టిడిపికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు.


ఇక ఆయన్ని టిడిపి అధిష్టానం బుజ్జగించే పనిలో ఉంది. ఆ విషయం పక్కన పెడితే…కన్నా వల్ల టిడిపికి ప్లస్ ఉందా? అంటే కాస్త ఉంటుందనే చెప్పాలి. గతంలో కన్నా..పెదకూరపాడు నుంచి నాలుగు సార్లు, గుంటూరు వెస్ట్ నుంచి ఒకసారి గెలిచారు. ఆ రెండు స్థానాల్లో కొంతవరకు ఫాలోయింగ్ ఉంది. అది టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే కాపు వర్గానికి చెందిన కన్నా చేరడం వల్ల..గుంటూరులో కాపు వర్గంలో టిడిపికి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మామూలుగా గుంటూరు టిడిపి అంటే కమ్మ వర్గమే గుర్తొస్తుంది. దాదాపు సగం పైనే సీట్లు కమ్మ వర్గం చేతుల్లోనే ఉన్నాయి. మూడు సీట్లలో ఎస్సీలు, ఒక సీటులో రెడ్డి, ఒక సీటులో క్షత్రియ, ఒక సీటులో గౌడ, ఒక సీటులో ముస్లిం నేతలు ఉన్నారు. కానీ కాపు నేతలు ఏ సీటులో కూడా లేరు.

ఇప్పుడు కన్నా రావడం కాపుల్లో కాస్త అడ్వాంటేజ్ పెరగవచ్చు. అలాగే కన్నాకు ఏ సీటు ఇస్తారనేది చూడాలి. ఆయనకు గుంటూరు వెస్ట్ గాని, సత్తెనపల్లి సీటు గాని ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎక్కువ శాతం సత్తెనపల్లి సీటు ఇచ్చే ఛాన్స్ ఉంది..ఎందుకంటే అక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ. నిజానికి బాబు ప్లాన్ కూడా అదే కాపు వర్గం కోసమే కన్నాని పార్టీలోకి తీసుకున్నారు.
