ఏపీలో కాపు నేతలు రాజకీయం ఆసక్తికరంగా మారింది..ఈ మధ్య కాపు నేతల భేటీలు సంచలనంగా మారుతున్నాయి. అది కూడా ఒక పార్టీలో నేతలు కాదు…టీడీపీ-జనసేన-బీజేపీలోని కాపు నేతలు కలుస్తున్నారు. అయితే డిసెంబర్ 26న వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా కాపు నాడు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఏపీలోని కాపు నేతలంతా హాజరు కావాలని ఆహ్వానాలు అందిస్తున్నారు. గంటా శ్రీనివాసరావు దీనిని లీడ్ చేస్తున్నారు.

అదే సమయంలో కాపు నేతలు ఆ మధ్య విశాఖలో గంటాని కలిశారు. అప్పుడు కాపునాడు పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఆ పోస్టర్‌లో పవన్, చిరంజీవి ఫోటోలు ఉన్నాయి. అలాగే టీడీపీ-వైసీపీ-జనసేన-బీజేపీ ఇతర పార్టీల్లో ఉన్న కాపు నేతల ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఈ కాపు నేతల భేటీల్లో వైసీపీ నేతలు కనిపించడం లేదు. తాజాగా కూడా విజయవాడలో పలువురు నేతలు కలిశారు. గంటా శ్రీనివాసరావు, బోండా ఉమా, యడం బాలాజీ, కన్నా లక్ష్మీనారాయణ…ఇలా పలువురు నేతలు విజయవాడలో భేటీ అయ్యారు.

అయితే ఇలా కాపు నేతలు వరుసగా భేటీ అవ్వడం, అటు విశాఖలో కాపు నాడు ఏర్పాటు చేయడం లాంటి అంశాలు..రాజకీయంగా కాపు వర్గం సరికొత్త ఆలోచనలతో వెళుతున్నట్లు తెలుస్తోంది. కాకపోతే వీటిల్లో వైసీపీ జోక్యం చేసుకోవడం లేదు. దీంతో ప్రదానంగా టీడీపీ-జనసేన వాళ్లే కనిపిస్తున్నారు.

దీంతో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు కుదర్చడానికే..కాపు నేతలు ట్రై చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ప్రధానంగా పవన్ కల్యాణ్ కోసం పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపి..టీడీపీ ద్వారా కాపు నేతలు సైతం అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు సెట్ అయితే..ఆటోమేటిక్‌గా వైసీపీకి చెక్ పడుతుందని భావిస్తున్నారు. చూడాలి మరి కాపు నేతల రాజకీయం ఎలా ఉంటుందో.

Leave feedback about this