ఎన్నో ఏళ్ల నుంచి కాపులు తమని బీసీల్లో చేర్చాలని పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. కాపులు, ఒంటరి, బలిజ, తెలగ కులాలు వారు….రిజర్వేషన్ల అంశంపై గట్టిగా పోరాడుతూ వస్తున్నారు. అయితే గత చంద్రబాబు ప్రభుత్వం కాపుల రిజర్వేషన్లకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. అయితే ఆ అంశం కేంద్రంలోనే పెండింగ్‌లో ఉంది. అయితే ఈలోపు కాపులకు చంద్రబాబు ప్రభుత్వం చేయాల్సిన న్యాయం చేస్తూనే వచ్చింది.

అలాగే 2019 ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిసైడ్ అయింది. విద్యా, ఉద్యోగ అవకాశాల్లో ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి.
అయితే ఏపీలో అగ్రవర్గాల్లో కాపులు, బలిజ కులాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో వారికి 5 శాతం, మిగిలిన వారికి 5 శాతం కేటాటించారు. కానీ నెక్స్ట్ జగన్ అధికారంలోకి వచ్చాక ఈ రిజర్వేషన్లు ఎత్తివేశారు. ఇక ఇటీవలే మళ్ళీ 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయడానికి సిద్ధమయ్యారు.

కానీ అందులో కాపులకు 5 శాతం లేవు. ఇక దీనిపై కాపుల పెద్దలు కూడా స్పందించలేదు. అటు రిజర్వేషన్ల అంశం పక్కకు వెళ్లింది…చంద్రబాబు ఇచ్చిన 5 శాతం పోయింది. అయినా సరే కాపు పెద్దలు జగన్ ప్రభుత్వాన్ని నిలదీయడం లేదు. కానీ ఇటీవలే పవన్ కల్యాణ్…కాపు రిజర్వేషన్లపై మాట్లాడటం మొదలుపెట్టాక, మళ్ళీ ఆ అంశంపై చర్చ జరుగుతుంది. కనీసం 5 శాతం రిజర్వేషన్లు అయినా ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదే క్రమంలో రఘురామకృష్ణంరాజు స్పందిస్తూ…చంద్రబాబు హయాంలో 10శాతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించారని, ఇది చాలా సముచితమని అన్నారు. అగ్ర కులాల్లో సగం మంది కాపులు, బలిజ తెలగ వారే ఉన్నారని, కాబట్టి వారికి 5 శాతం ఇచ్చి, మిగిలిన అగ్రకులాలకు 5 శాతం కేటాయించాలని కోరారు. మరి దీనిపై జగన్ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో లేదో చూడాలి.

Discussion about this post