రాజకీయాల్లో ఎప్పుడూ.. ఒకే విధమైన పరిస్థితి ఉండదు. పరిస్థితులకు అనుగుణంగా మార్పు సహజం. ఈ క్రమంలోనే అనేక సవాళ్లు ప్రతిసవాళ్లు వస్తుంటాయి. వీటిని తట్టుకుని ముందుకు సాగడం అనేది నేతలకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. అయితే..ప్రకాశం జిల్లాకుచెందిన సీనియర్ నాయకుడు, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ కృష్ణమూర్తి మాత్రం..`మార్పును` సహించలేక పోతున్నారు. ప్రస్తు తం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచి.. ఇప్పుడు వైసీపీలోకి వచ్చారు.

అయితే.. ఆల్రెడీ.. వైసీపీలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోషన్ బలమైన నాయకుడిగా ఇక్కడ చక్రం తిప్పుతున్నారు. ఇప్పుడు ఈయనను కాదంటే.. వైసీపీపై ప్రజల్లో ఒక విధమైన భావన వ్యక్తమవుతుంది. పైగా జిల్లా కాపు సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న ఆమంచికి బలమైన మాస్ ఓటింగ్ ఉన్న నియోజకవర్గంగా చీరాల పేరు పొందింది. వచ్చే ఎన్నికల్లో ఆయన గెలుపు ఖాయమని కూడా వలంటీర్లు ఇచ్చిన నివేదికల్లో వైసీపీ అధిష్టానం ఖాయం చేసుకుంది. ఈ నేపథ్యంలో నిన్న మొన్నటి వరకు తర్జన భర్జన పడినప్పటికీ.. కొన్నాళ్లుగా మాత్రం వైసీపీ ఈ విషయంలో స్పష్టమైన వైఖరితోనే ఉంది.

ఈ క్రమంలో అటు ఆమంచిని, ఇటు కరణంను ఇబ్బంది పెట్టకుండా.. పొరుగున ఉన్న పరుచూరు నియోజ కవర్గాన్ని.. కరణంకు ఖరారు చేసేందుకు పార్టీ ఓకే చెప్పింది. ఇదినిజంగా పెను మార్పు. ఎందుకంటే.. ఇప్పటి వరకు కరణం.. రెండు నియోజకవర్గాల్లోనే చక్రం తిప్పారు. అద్దంకిలో తిరుగులేని హవా ప్రదర్శించారు. ఇప్పుడు చీరాల. అయితే.. ఇక్కడ స్థానం దక్కదని తెలియడం.. పరుచూరుకు వెళ్లాలని ఒకరకంగా.. గట్టి సూచనలే రావడంతో.. కరణం ఈ మార్పును జీర్ణించుకోలేక పోతున్నారట. ఇదే విషయాన్ని ఆయన తన సన్నిహితులతో చెప్పుకొస్తున్నారు.

పరుచూరు కరణం సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం అంతేకాదు.. ఇక్కడ ఆయన దూకుడు ప్రదర్శిస్తే.. కుదరదు. అభివృద్ది సంక్షేమం నినాదంతో ఇక్కడ ఏలూరి సాంబశివరావు.. వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇక్కడ కరణం.. కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఇదే ఆయనకు నచ్చడం లేదని.. అంటున్నారు. అంటే.. మార్పుతోపాటు.. కష్ట పడేందుకు ఆయన కొంత ముందుకు వస్తే.. పరుచూరులోనూ ఆయన విజయం దక్కించుకునే అవకాశం ఉంది.

అయితే.. ఈ విషయాన్ని పక్కన పెట్టి.. దీనిని పెద్ద సమస్యగా ఆయన భావిస్తుండడమే ఆయనకు ఇప్పుడు పెద్ద అగ్ని పరీక్షగా మారింది. దీనిని లైట్ తీసుకుని.. ఇప్పటి నుంచి అక్కడ పునాదులు వేసుకునే ప్రయత్నం చేస్తే.. అటు పార్టీని గౌరవించినట్టు, ఇటు తన సత్తాను చాటుకున్నట్టు అవుతుందని అంటున్నారు పరిశీలకులు.

Discussion about this post