May 28, 2023
ap news latest AP Politics TDP latest News YCP latest news

వంశీ-కరణం నీతి వాక్యాలు..జనం నమ్ముతారా?

తెలుగు ప్రజలకు గురివింద గింజ సామెత గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. గురివింద సామెత అందరికీ తెలిసిందే. తెలిసిన సరే ఇంకో సారి ఆ సామెత గురించి ఒకసారి మాట్లాడుకుంటే..గురివింద గింజ రెండు రంగులు ఉంటుంది. ఎరుపు, నలుపు. కానీ గురివింద తన ఎరుపుని చూసి మురిసిపోతుంది తప్ప..నలుపుని పట్టించుకోదంటా..ఇంకా ఈ సామెతని మోటుగా కూడా చెప్పేవాళ్లు ఉన్నారు. సరే ఆ విషయం వదిలిపెడితే..ఇప్పుడు ఈ సామెత ఎందుకు గుర్తు చేశామనే విషయానికొస్తే..ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ తాము చేసిన తప్పు తప్పు కాదని..ఎదుట వారు ఏం చేసిన అదే తప్పే అనే విధానంతో వెళుతుంది.

ఎందుకంటే తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి క్రాస్ ఓటు చేశారు. దీంతో టి‌డి‌పి అభ్యర్ధి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. అయితే ఆ క్రాస్ ఓటింగ్ చేసిన ఎమ్మెల్యేలు ఎవరు అనేది కనుక్కోవడానికి వైసీపీ కొంత సమయం తీసుకుంది. తీసుకుని ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి..వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

ఇక ఒక్కో ఎమ్మెల్యేకు చంద్రబాబు..15-20 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చారని ఆరోపణలు చేశారు. అలాగే కన్నా తల్లి లాంటి పార్టీకి నమ్మక ద్రోహం చేశారని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. అయితే టి‌డి‌పి నుంచి వైసీపీలోకి వెళ్ళిన నలుగురు ఎమ్మెల్యేల సంగతి ఏంటి..జనసేన ఎమ్మెల్యే సంగతి ఏంటి? వారు కన్నతల్లి లాంటి పార్టీని మోసం చేయలేదా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

సరే వైసీపీ నేతలు ఏదో బాధలో మాట్లాడుతున్నారనుకుంటే..టి‌డి‌పి లో గెలిచి వైసీపీలోకి వెళ్ళిన వల్లభనేని వంశీ, కరణం బలరామ్ సైతం అ తరహాలో మాట్లాడటం, రాజకీయ విలువలు పడిపోయాయని, చంద్రబాబు డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలని కొనుగోలు చేశారని మాట్లాడటమే పెద్ద విడ్డూరంగా ఉంది. వీరు గెలిచింది టి‌డి‌పిలో ఇప్పుడు వైసీపీలో ఉన్నారు. మరి వీరికి ఎంత డబ్బు వచ్చిందనే ప్రశ్నలు వస్తున్నాయి. గురివింద సామెత అందుకే వచ్చిందని, ఇలాంటి వారు నీతి వాక్యాలు చెబితే జనం నమ్మే పరిస్తితి లేదని అంటున్నారు.