గత ఎన్నికల్లో చాలామంది వైసీపీ నేతలు…కేవలం జనసేన ఓట్లు చీల్చడం వల్ల విజయం సాధించిన విషయం తెలిసిందే…దాదాపు 50 మంది వరకు ఓట్లు చీలడం వల్ల గెలిచేశారు..టీడీపీ-జనసేన విడిగా పోటీ చేయడం వైసీపీకి బాగా కలిసొచ్చింది. అలా విడిగా పోటీ చేయడం వల్ల తణుకులో కారుమూరి నాగేశ్వరరావుకు కూడా బాగా ప్లస్ అయింది..కేవలం 2 వేల ఓట్ల తేడాతో కారుమూరి…టీడీపీ నేత అరిమిల్లి రాధాకృష్ణపై గెలిచారు. ఇక ఇక్కడ జనసేనకు 31 వేల ఓట్లు వరకు పడ్డాయి. అంటే టీడీపీ-జనసేన కలిస్తే కారుమూరి గెలుపు సాధ్యమయ్యేది కాదు…ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

ఇక అలా లక్కీగా గెలిచేసిన కారుమూరి…అంతే లక్కీగా మంత్రి పదవి కూడా దక్కించుకున్నారు. ఇప్పుడు మంత్రిగా పనిచేస్తున్నారు. ఇలా జనసేన ఎఫెక్ట్ వల్ల కారుమూరికి బంపర్ ఆఫర్లు దక్కాయి. అయితే ఈ సారి మాత్రం కారుమూరికి ఎలాంటి లక్కీ ఛాన్స్ దొరికేలా లేదు. ఈ సారి కారుమూరికి తణుకు ప్రజల మద్ధతు దొరికేలా లేదు.ఇప్పటికే తణుకులో కారుమూరిపై వ్యతిరేకత మొదలైంది..ఎమ్మెల్యేగా గాని, మంత్రిగా గాని తణుకు నియోజకవర్గానికి కారుమూరి పెద్దగా చేసింది ఏమి లేదు.పైగా సమస్యలపై ఎవరైనా ప్రశ్నిస్తే వారినే రివర్స్ లో తిట్టడం చేస్తున్నారు. దీంతో తణుకు ప్రజలు కారుమూరికి మద్ధతుగా నిలిచేందుకు సిద్ధగా లేరు. ఈ సారి అరిమిల్లి వైపే ప్రజలు మొగ్గు చూపేలా ఉన్నారు..ఒకవేళ జనసేన కలవకపోయినా సరే అరిమిల్లి విజయానికి ఎలాంటి ఇబ్బంది ఉండేలా లేదు. ఎందుకంటే గతంలో అరిమిల్లి ఎమ్మెల్యేగా బాగానే పనిచేశారు.
నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటపట్టించారు. అందుకే ప్రజలు అరిమిల్లిని ఈ సారి గెలిపించుకోవడానికే చూస్తున్నట్లు తెలుస్తోంది. కాకపోతే జనసేనతో పొత్తు ఉంటే మాత్రం అరిమిల్లి విజయానికి ఎలాంటి ఢోకా లేదు..పైగా భారీ మెజారిటీ వచ్చే అవకాశం ఉంది….ఒకవేళ జనసేన తో పొత్తు లేకపోయిన స్వల్ప మెజారిటీతో బయటపడే ఛాన్స్ కనిపిస్తోంది.
Discussion about this post