ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని జిల్లా…ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. రెడ్డి, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాలో మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. అంటే జిల్లాలో వైసీపీ బలం ఎలా ఉందో చూసుకోవచ్చు.

కానీ పది సీట్లు ఇచ్చిన జిల్లాని పెద్దగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పైగా కొందరు ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి పెరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ వైసీపీకి మైనస్ అవుతున్నాయి. ఇదే సమయంలో టీడీపీ నేతలు సరిగ్గా బలంగా లేకపోవడం వల్ల టీడీపీకి కూడా జిల్లాలో ప్లస్ కనిపించడం లేదు. ఇందులో కావలి నియోజకవర్గం పెద్ద ఉదాహరణగా ఉంది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యేగా ఈయన పనితీరు అంతగా బాగోలేదని సొంత పార్టీ నుంచే విమర్శలు వస్తున్నాయి.

పైగా నియోజకవర్గంలో దందాలు, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు పెరిగిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని వల్ల వైసీపీకి పెద్ద మైనస్ ఉంది. కానీ ఇక్కడ టీడీపీ కూడా సరిగా లేదు. టీడీపీ క్యాడర్ ఫుల్ గానే ఉంది గాని సరైన నాయకుడు లేరు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అడ్రెస్ లేరు. అటు బీదా మస్తాన్ రావు వైసీపీలోకి వెళ్లారు.

బీదా రవిచంద్ర ఏమో నియోజకవర్గ బాధ్యతలు చూసుకోలేనని చేతులు ఎత్తేశారు. దీంతో ఒక మండల స్థాయి నాయకుడైన సుబ్బానాయుడుని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయన అలా అలా పార్టీని నడిపించుకుంటూ వస్తున్నారు. దీంతో పార్టీ బలపడట్లేదు. అయితే డిసెంబర్ 29న కావలిలో చంద్రబాబు పర్యటన ఉంది..అప్పుడైనా టీడీపీలో మార్పు వస్తుందేమో చూడాలి.

Leave feedback about this