ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాసేపట్లో ప్రగతి భవన్‌కు వెళ్లనున్నారు. ఈడీ నోటీసులు, విచారణపై సీఎం కేసీఆర్‌తో చర్చించనున్నారు. జంతర్ మంతర్ వద్ద ధర్నా నేపథ్యంలో ఈ సాయంత్రమే ఢిల్లీకి కవిత వెళ్లాల్సి ఉంది. కవిత అరెస్టుపై బీఆర్ఎస్‌లో ఊహాగానాలు వస్తున్నాయి. అరెస్టు అయితే ఢిల్లీ, తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు తెలిపేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందాయి. ఈ నెల ఢిల్లీలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. కవిత బినామీనంటూ అరుణ్ రామచంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ ప్రస్తావించింది. కవిత రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. జంతర్ మంతర్ దగ్గర నిరాహార దీక్షలో ఆమె పాల్గొననున్నారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ల కోసం కవిత నిరాహార దీక్ష చేయనున్నారు. రామచంద్ర పిళ్లైను 5 రోజుల కస్టడీ కి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతించింది.

ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. విచారణకు హాజరు అయ్యేందుకు సమయం కావాలని ఆమె అడుగుతున్నారు. 10 వ తేదీ తరువాత విచారణకు వస్తానని ఈడీ ని కోరుతున్నారు. ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున 9న విచారణకు హాజరు కాలేనని కవిత చెబుతున్నారు. 33 శాతం మహిళా రిజర్వేషన్ల కోసం 10 న ఢిల్లీ లో ధర్నాకు కవిత సన్నాహాలు చేసుకున్నారు. ఆ కార్యక్రమం తరువాత విచారణకు హాజరు అవుతానని ఈడీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. కవిత విజ్ఞప్తి పై ఇంకా ఈడీ అధికారులు స్పందించలేదు.