గత ఎన్నికల్లో చాలామంది టిడిపి సీనియర్ నేతల వారసులు ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఏ ఒక్క వారసుడు కూడా విజయం సాధించలేదు. అందరు ఓటమి పాలయ్యారు. పరిటాల వారసుడు శ్రీరామ్, కాగిత వారసుడు, గౌతు ఫ్యామిలీ వారసురాలు శిరీష, బాలయోగి వారసుడు హరీష్, బొజ్జల వారసుడు సుధీర్..అదే క్రమంలో కేఈ కృష్ణమూర్తి వారసుడు కేఈ శ్యామ్ సైతం ఓటమి పాలయ్యారు.
ఇలా వారసులంతా ఓటమి పాలయ్యారు. అలా ఓడిపోయిన వారసులంతా ఈ సారి ఎన్నికల్లో గెలిచి వైసీపీపై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లా పత్తికొండలో కేఈ వారసుడు సత్తా చాటాలని చూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా టిడిపిలో పనిచేస్తూ అనేక విజయాలు సొంతం చేసుకున్నా కేఈ 2014 ఎన్నికల్లో పత్తికొండ నుంచి గెలిచి డిప్యూటీ సిఎంగా పనిచేసిన విషయం తెలిసిందే. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో వయసు మీద పడటంతో పోటీ నుంచి తప్పుకుని పత్తికొండలో తన తనయుడు శ్యామ్ని నిలబెట్టారు. కానీ శ్యామ్ అనుహ్యాంగా ఓడిపోయారు.

వైసీపీ నుంచి శ్రీదేవి గెలిచారు. కేవలం జగన్ గాలిలోనే ఆమె గెలిచారు. అయితే ఇప్పుడు ఆమెకు వ్యతిరేకత కనిపిస్తుంది. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు. పైగా ఎమ్మెల్యే బంధువుల అక్రమాలు ఎక్కువయ్యాయని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆమెపై యాంటీ పెరిగింది. ఇటీవల సర్వేల్లో కూడా శ్రీదేవికి సీటు ఇస్తే మళ్ళీ గెలవడం కష్టమని తేలిపోయింది.
ఈ సారి టిడిపి హవా నడిచేలా ఉంది. టిడిపి నుంచి శ్యామ్ మళ్ళీ బరిలో దిగేందుకు రెడీ అయ్యారు. ఆ మధ్య చంద్రబాబు నియోజకవర్గానికి బాదుడేబాదుడు కార్యక్రమానికి వచ్చారు. అప్పుడు పెద్ద ఎత్తున ప్రజా స్పందన వచ్చింది..దీంతో పత్తికొండలో టిడిపి బలం పెరిగిందని తేలింది. ఏదేమైనా ఈ సారి పత్తికొండలో టిడిపి గెలుపు ఫిక్స్.
