ఏపీలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడుప్పుడే పుంజుకుంటున్న విషయం తెలిసిందే. వైసీపీకి ధీటుగా టీడీపీ నేతలు ఫైట్ చేస్తున్నారు. ఎక్కడకక్కడ వైసీపీ ఆధిక్యం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా అని వైసీపీ ఆధిక్యం తగ్గలేదు. వైసీపీ ఆధిక్యం కొనసాగుతూనే ఉంది. కానీ టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకుంది. 2019 ఎన్నికల్లో పరిస్తితి మాత్రం ఇప్పుడు లేదు. అయితే టీడీపీ ఇంకా పుంజుకోవాల్సిన అవసరముంది. కొందరు నాయకులు ఇంకా బయటకు రావాలి..పార్టీ కోసం పనిచేయాలి.

అప్పుడే టీడీపీ, వైసీపీకి గట్టి పోటీ ఇవ్వగలదు. లేదంటే మళ్ళీ గెలవడం కష్టం. అయితే టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు యాక్టివ్‌గా పనిచేయాల్సిన అవసరముంది. ముఖ్యంగా కేఈ కృష్ణమూర్తి లాంటి వారు. అసలు కర్నూలు జిల్లాలో కేఈ ఫ్యామిలీ దశాబ్దాల కాలం నుంచి టీడీపీలో రాజకీయం చేస్తుంది. అలాంటిది గత ఎన్నికల నుంచి ఆ ఫ్యామిలీ పార్టీలో కనిపించడం లేదు. గత ఎన్నికల్లో కేఈ పోటీ చేయకుండా ఆయన తనయుడు శ్యామ్..పత్తికొండ నుంచి పోటీ చేశారు. అలాగే డోన్ నుంచి కేఈ సోదరుడు ప్రతాప్ పోటీ చేశారు.

కానీ జగన్ గాలిలో ఇద్దరు ఓడిపోయారు. ఓడిపోయాక ఇద్దరు నేతలు పార్టీలో కనిపించడం లేదు. అటు వయసు మీద పడటంతో కృష్ణమూర్తి కూడా పార్టీలో యాక్టివ్‌గా లేరు. కేఈ మరో సోదరుడు ప్రభాకర్ సైతం టీడీపీకి దూరం జరిగారు. మధ్యలో ప్రతాప్ సైడ్ అవ్వడంతో ఆయనకు డోన్ బాధ్యతలు అప్పగించారు. కానీ ప్రభాకర్ కూడా సరిగా పనిచేయలేదు. దీంతో ఆయన కూడా పక్కనబెట్టేసే సుబ్బారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు.

ఇప్పుడు కేఈ ఫ్యామిలీ చేతిలో పత్తికొండ మాత్రమే ఉంది. అయితే పత్తికొండలో శ్యామ్ ఇంకా యాక్టివ్ కాలేదు. ఆయన ఇకనుంచైనా యాక్టివ్ అయ్యి పనిచేస్తే బాగుంటుంది. అలా కాకుండా లైట్ తీసుకుంటే కేఈ ఫ్యామిలీ చేతి నుంచి పత్తికొండ కూడా జారిపోవడం ఖాయమే.

Discussion about this post