గత ఎన్నికల్లో అంటే చంద్రబాబు కొన్ని రూల్స్ పెట్టడం వల్ల చాలామంది సీనియర్ నేతల ఫ్యామిలీలకు రెండు టిక్కెట్ దక్కలేదు. ఆ రూల్స్ ఏ మాత్రం వర్కౌట్ కాలేదు. అయితే ఈ సారి మాత్రం రెండో సీటు దక్కించుకునే విషయంలో టీడీపీ సీనియర్లు ఏ మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. ఎలాగైనా రెండో సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు.

గత ఎన్నికల్లో కొన్ని ఫ్యామిలీలకు రెండు సీట్లు దక్కిన విషయం తెలిసిందే..కింజరాపు, అశోక్ గజపతి, జేసీ, భూమా, కోట్ల ఫ్యామిలీలకు రెండేసి టిక్కెట్లు వచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ ఫ్యామిలీలకు రెండేసి టిక్కెట్లు దక్కనున్నాయి. ఇక వీరితో పాటు పలు ఫ్యామిలీలు కూడా రెండో సీటు కోసం గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అసలు ఎప్పటినుంచో అయ్యన్నపాత్రుడు తన కుమారుడుకు టిక్కెట్ తీసుకోవాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎలాగైనా తన వారసుడుకు సీటు దక్కించుకునేలా ఉన్నారు. అటు పరిటాల ఫ్యామిలీ కూడా రెండు సీట్లపై గట్టిగా నిలబడింది…ఎలాగో రాప్తాడు, ధర్మవరం సీట్లు చేతిలో ఉన్నాయి..ఇందులో ఏది వదులుకోవడానికి పరిటాల ఫ్యామిలీ సిద్ధంగా లేదు. ఇక చేతిలో రెండు సీట్లు ఉంటే అనసరంగా పోగొట్టుకున్న కేఈ కృష్ణమూర్తి ఫ్యామిలీ…ఇప్పుడు రెండో సీటు కోసం తెగ ట్రై చేస్తుంది. మొన్నటివరకు కేఈ ఫ్యామిలీ చేతిలో పత్తికొండ, డోన్ సీట్లు ఉన్నాయి.

కానీ రెండుచోట్ల కేఈ ఫ్యామిలీ రాజకీయంగా యాక్టివ్‌గా లేదు…దీంతో చంద్రబాబు, డోన్‌లో మరో ఇంచార్జ్‌ని పెట్టారు. డోన్ కేఈ ఫ్యామిలీ నుంచి చేజారింది. అయితే ఇప్పుడు ఆ సీటు కోసం మళ్ళీ ట్రై చేస్తున్నారు. డోన్ కాకపోతే కర్నూలు సిటీ గాని, ఆలూరు గాని ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అటు గౌరు చరితా రెడ్డి ఫ్యామిలీ సైతం రెండు సీట్లు అడుగుతున్నట్లు తెలుస్తోంది. పాణ్యం సీటు ఎలాగో ఉంది…అయితే నంద్యాల పార్లమెంట్ సీటు అడుగుతున్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సారి ఏ ఫ్యామిలీకి రెండేసి సీట్లు వస్తాయో?
Discussion about this post